కరోనా పరీక్షలు చేయడంలో భారత్ రికార్డులు సృష్టిస్తోంది. ఒక్క రోజులో 20.55 లక్షల పరీక్షలు చేసి ఇటీవలి రికార్డును తిరగరాసింది. గత ఏడు రోజులుగా కరోనా బారిన పడిన వారి కంటే కోలుకున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
- ఒక్క రోజులో3,69,077 మంది కరోనా నుంచి కోలుకున్నారు
- 2,76,110మంది వైరస్ బారిన పడ్డారు
- 3,874 మంది మృతి చెందారు
- మరణాల శాతం కేవలం 1.11
- మొత్తంగా 2,23,55,440 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు
- ఒక్కరోజులో 96,841యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది
- మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 31,29,878
- ఇప్పటి వరకు 18.70కోట్ల మందికి టీకా పంపిణీ చేశారు
- ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వద్ద ఉన్న టీకా డోసులు 21,07,31,130
- మరో మూడు రోజుల్లో కేంద్రం పంపించనున్న టీకా డోసులు 25,98,760