కాబుల్ విమానాశ్రయంలో జరిగిన పేలుళ్ల(kabul airport blast) ఘటనను భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రపంచం ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని కాబుల్ ఘటన సూచిస్తోందని తెలిపింది. మృతుల కుటుంబాలకు కేంద్ర విదేశాంగ శాఖ సంతాపం తెలిపింది. ఉగ్రదాడులకు(Terror Attacks) వ్యతిరేకంగా ప్రపంచం ఏకతాటిపై నిలవాలని సూచించింది.
"ఈ పేలుళ్లు.. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచం ఏకతాటిపైకి రావాలని సూచిస్తున్నాయి. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న వారికి వ్యతిరేకంగా ప్రపంచం పోరాడాలి. "