తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత సైన్యం సత్తా ఏంటో చైనాకు అర్థమైంది' - ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు

భారత సైనిక దళాలను తేలికగా తీసుకోరాదన్న విషయం చైనాకు అర్థమైందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ అన్నారు. భారత్​-చైనా తూర్పు లద్దాఖ్​లో యథాతథస్థితిని నెలకొల్పాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు.

rawat, cds
బిపిన్ రావత్, సీడీఎస్

By

Published : Jul 2, 2021, 6:13 PM IST

భారత్‌ దళాలను తేలిగ్గా తీసుకోవద్దన్న నిజాన్ని చైనా అర్థం చేసుకుందని చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్ రావత్‌ అన్నారు. సరిహద్దుల్లో డ్రాగన్‌ దుందుడుకుగా వ్యవహరిస్తే దీటుగా బదులిస్తామని హెచ్చరించారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్‌-చైనా యథాతథ స్థితిని సాధించగలగాలని.. లేకపోతే అది దుర్ఘటనలకు దారి తీసే అవకాశం ఉందని రావత్‌ అభిప్రాయపడ్డారు. లద్దాఖ్‌లో శాంతి భద్రతలు అత్యంత ముఖ్యమని ఇరు పక్షాలకు తెలుసన్నారు.

భారత సైన్యం అన్నింటికీ సిద్ధంగా ఉండాలన్న రావత్‌.. ఏ విషయాన్నీ తేలిగ్గా తీసుకోవద్దని, పరిస్థితులకు తగ్గట్లుగా వేగంగా స్పందించాలని వ్యాఖ్యానించారు. భారత్‌-చైనా మధ్య రాజకీయ, దౌత్య, సైనిక స్థాయుల్లో చర్చలు కొనసాగుతున్నాయని, ఇవి కొలిక్కి వచ్చేందుకు సుదీర్ఘ సమయం పడుతుందని తెలిపారు. సరిహద్దుల్లో భారత్‌ భారీగా దళాలను మోహరించిందని వివరించారు.

ఇదీ చదవండి:'వారికి సైన్యం సాయం చేయాల్సిన తరుణమిది'

ABOUT THE AUTHOR

...view details