india China Military talks: వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించే దిశగా మరో దఫా చర్చలకు సిద్ధమవుతున్నాయి భారత్, చైనా. ఇరు దేశాల మధ్య 14వ దఫా కార్ప్స్ కమాండ్ స్థాయి చర్చలు ఈనెల ద్వితీయార్థంలో జరిగే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
"14వ విడత చర్చలకు చైనా వైపు నుంచి ఆహ్వానం అందింది. డిసెంబర్ ద్వితీయార్థంలో ఈ చర్చలు జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. 1971 యుద్ధంలో పాకిస్థాన్‌పై విజయాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తోన్న గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో డిసెంబర్ 16 వరకు సైనిక బలగాలు నిమగ్నమై ఉంటాయి. ఆ తర్వాతే చర్చలకు సమయం నిర్ణయించే అవకాశం ఉంది."
- అధికార వర్గాలు
సరిహద్దు సమస్య పరిష్కారం కోసం ఇప్పటి వరకు 13 దఫాలుగా చర్చలు జరిగాయి. పాంగాంగ్ సరస్సు ఫ్రిక్షన్ పాయింట్లు, గోగ్రా హైట్స్ నుంచి బలగాల ఉపసంహరణ పూర్తయింది. హాట్ స్ప్రింగ్స్ వద్ద బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోంది.