తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సరిహద్దులో శాంతి లేకుంటే సత్సంబంధాలు కష్టమే'... చైనాకు రాజ్​నాథ్​ గట్టి సందేశం - మంత్రి లీ షాంగ్‌ఫూతో రాజ్​నాథ్​ మీటింగ్​

SCO కీలక సమావేశం కోసం భారత్‌ వచ్చిన చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫూ.. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. తూర్పు లద్ధాఖ్‌లో కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై ఇరుదేశాల నేతలు ఈ సమావేశంలో చర్చించుకున్నట్లు తెలుస్తోంది.

Rajnath Singh discusses LAC with Chinese counterpart
చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫూతో రాజ్​నాథ్​ భేటీ.. లద్ధాఖ్ గొడవ తర్వాత ఇదే తొలిసారి..

By

Published : Apr 27, 2023, 8:22 PM IST

Updated : Apr 28, 2023, 8:47 AM IST

గాల్వాన్ ఘటన తర్వాత చైనా, భారత్‌ల రక్షణ మంత్రుల తొలి సమావేశంలో భారత్ చైనాకు గట్టి సందేశం పంపింది. సరిహద్దులో శాంతి, ప్రశాంతత ఆవశ్యకతలను నొక్కి చెప్పిన భారత్‌.. ఒప్పందాల ఉల్లంఘనతో ద్వైపాక్షిక బంధాల ప్రాతిపదిక దెబ్బతింటుందని డ్రాగన్‌కు స్పష్టం చేసింది. సరిహద్దుల వద్ద సుస్థిర శాంతి ప్రాబల్యంపైనే ఇరుదేశాల బంధాల బలోపేతమనేది ఆధారపడి ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ నిర్ద్వంద్వంగా తెలియజేశారు. LAC వద్ద సమస్యలను ద్వైపాక్షిక ఒప్పందాలు, కట్టుబాట్లకు అనుగుణంగా పరిష్కరించాలని అన్నారు.

దిల్లీలో శుక్రవారం జరగనున్న షాంఘై సహకార సంస్థ SCO కీలక సమావేశం కోసం భారత్‌ వచ్చిన చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫూ భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయ్యారు. తూర్పు లద్ధాఖ్‌లో కొనసాగుతున్న సరిహద్దు వివాదంపై ఇరుదేశాల నేతలు చర్చించారు. అఫ్గానిస్తాన్‌, మధ్య ఆసియాతో లాజిస్టిక్ సమస్యలను తగ్గించడానికి అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా కారిడార్ అభివృద్ధిపై చర్చించినట్లు సమాచారం.

తూర్పు లద్ధాఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఎసి) వెంబడి మూడు సంవత్సరాల సరిహద్దు వివాదం ఇరుపక్షాల మధ్య సంబంధాలను గణనీయంగా దెబ్బతీసిందని లీతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో రాజ్​నాథ్​ పేర్కొన్నారు. ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల ప్రకారం ఎల్‌ఏసీలో అన్ని సమస్యలను పరిష్కరించాలని చైనా రక్షణ మంత్రిని రాజ్​నాథ్​ కోరారు. భారత్‌-చైనా సరిహద్దు ప్రాంతంలో నెలకొన్న పరిణామాలు సహా ఇతర ద్వైపాక్షిక సంబంధాలపై ఇద్దరు మంత్రులు కూలంకషంగా చర్చలు జరిపినట్లు భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే జరిపిన పలు ఒప్పందాల ఉల్లంఘన రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీశాయని రాజ్​నాథ్​ పునరుద్ఘాటించారు.

చైనా రక్షణ మంత్రి లీ షాంగ్‌ఫూతో రాజ్​నాథ్​ భేటీ.. లద్ధాఖ్ గొడవ తర్వాత ఇదే తొలిసారి..

ఏప్రిల్ 28న దేశంలో జరిగే షాంఘై సహకార సంస్థ-SCO సందర్భంగా పలు దేశాల రక్షణ మంత్రులు ఇప్పటికే భారత్​కు చేరుకున్నారు. ఈ సమావేశానికి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించనున్నారు. అఫ్గానిస్థాన్‌లో పరిణామాలతో సహా ప్రాంతీయ భద్రతా పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ సమావేశానికి వర్చువల్ మోడ్ ద్వారా హాజరవుతారని తెలుస్తోంది.

చైనాకు సంస్కారమైన నమస్కారం!
భారత్​-చైనా ద్వైపాక్షిక సమావేశానికి ముందు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తజికిస్థాన్, ఇరాన్​, కజకిస్థాన్​ సహా ఇతర దేశాల రక్షణ మంత్రులతో కరచాలనం చేశారు. కానీ, అక్కడే ఉన్న చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫూనకు మాత్రం చేతులు జోడించి నమస్కారం పెట్టారు రాజ్‌నాథ్. చైనాతో చర్చలు ప్రారంభం కాకముందు తజికిస్థాన్ రక్షణ మంత్రి కల్నల్ జనరల్ షెరాలీ మీర్జో, ఇరాన్ రక్షణ మంత్రి, బ్రిగేడియర్ జనరల్ మొహమ్మద్ రెజా ఘరాయీ అష్టియాని సహా కజకిస్థాన్ రక్షణ మంత్రి కల్నల్ జనరల్ రుస్లాన్ జాక్సిలికోవ్‌తో కూడా రాజ్​నాథ్​ సమావేశం అయ్యారు.

చైనాకు నమస్కారం.. ఇతర దేశాలకు షేక్​ హ్యాండ్​ ఇస్తున్న రాజ్​నాథ్​!
Last Updated : Apr 28, 2023, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details