తూర్పు లద్ధాఖ్లోని గల్వాన్ లోయ(Galwan Valley)లో భారత్, చైనా సైన్యాల మధ్య జరిగిన పెను ఘర్షణకు మంగళవారంతో ఏడాది పూర్తవుతుంది. నాడు డ్రాగన్ దురాగతాన్ని ఎదిరిస్తూ తెలుగు యోధుడు కర్నల్ సంతోష్ బాబు(Colonel Santosh Babu) నేతృత్వంలోని భారత సైనికులు చూపిన తెగువ, చేసిన బలిదానాన్ని ఈ సందర్భంగా దేశం స్మరించుకోనుంది.
2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. దీంతో దాదాపు 5 దశాబ్దాల తర్వాత రెండు దేశాల సరిహద్దుల్లో తొలిసారి ప్రాణనష్టం సంభవించింది. ఆ పోరులో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబు సహా.. 20 మంది సైనికులు వీరమరణం పొందారు.