India China border issue: వాస్తవాధీన రేఖ వద్ద సరిహద్దు వివాద పరిష్కారానికి సైనిక కమాండర్ల స్థాయి 15వ విడత చర్చలు వీలైనంత త్వరగా నిర్వహించుకునేందుకు భారత్-చైనా అంగీకరించాయి. 14వ విడత చర్చలు జరిగిన తర్వాత అసంపూర్తిగా మిగిలిపోయిన అంశాల పరిష్కారానికి త్వరలోనే తీర్మానం రూపకల్పనకు రెండు దేశాలు నిర్ణయించాయని విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. అలాగే సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి అంగీకరించాయని వెల్లడించారు
"జనవరి 12న 14వ విడత భారత్ చైనా కార్ప్స్ కమాండర్ స్థాయి సమావేశం జరిగింది. ఇరుపక్షాలు ఆ తీర్మానాన్ని అంగీకరించాయి. ఇది వాస్తవాధీన రేఖ వద్ద శాంతి, సామరస్యం నెలకొని, భారత్-చైనా మధ్య ద్వైపాక్షి బంధం బలపడేందుకు దోహదం చేస్తుంది. అలాగే ఇరుపక్షాలు పరస్పర ఆమోదయోగ్యమైన తీర్మానాన్ని రూపొందించడానికి సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి.. మరో విడత సైనిక కమాండర్ల స్థాయి చర్చలు నిర్వహించుకునేందుకు అంగీకరించాయి."