తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​- చైనా సైనికుల ఘర్షణ తర్వాత తవాంగ్‌లో పరిస్థితేంటి? - ఇండియన్​ ఆర్మీ లేటెస్ట్​ న్యూస్​

అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ సెక్టార్‌. చైనాకు అత్యంత సమీపంలో ఉన్న సరిహద్దు ప్రాంతం. ఈ ప్రాంతంలోనే.. భారత భూభాగంలోకి దూసుకొచ్చేందుకు యత్నించిన డ్రాగన్‌ బలగాలను.. ఇండియన్‌ ఆర్మీ తరిమికొట్టింది. చైనా బలగాలను తరిమికొట్టిన తర్వాత.. తవాంగ్‌ సెక్టార్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి. ఇరు దేశాల సైనికుల ఘర్షణపై స్థానికులు ఏం అంటున్నారు. ఇప్పుడు తవాంగ్‌ సెక్టార్‌లో ప్రశాంత వాతావరణమే ఉందా.. పదండి తవాంగ్‌ సెక్టార్‌కు వెళ్లి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకుని వద్దాం.

india china border dispute
india china border dispute

By

Published : Dec 15, 2022, 6:59 PM IST

చైనాతో ఘర్షణ తర్వాత తవాంగ్‌లో పరిస్థితేంటి?

అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చెబుతున్న చైనా.. దానిపై ఎప్పుటి నుంచో కన్నేసింది. అందుకే అవకాశం వచ్చిన ప్రతీ సారి.. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు కుట్ర పన్నుతూ ఉంటుంది. అందుకే డిసెంబర్‌ 9న మన భూభాగం వైపు చొచ్చుకుచ్చేందుకు ప్రయత్నించింది. దీనిని సమర్థంగా అడ్డుకున్న భారత బలగాలు.. డ్రాగన్‌ సైనికులను తరిమికొట్టాయి. ఈ పరిస్థితి తర్వాత తవాంగ్‌ సెక్టార్‌లోని ప్రజలందరూ.. ఇండియన్‌ ఆర్మీ విజయాన్ని చూసి ఉప్పొంగిపోయారు. భారత సైనికులు.. చైనా సైనికులను తరిమి కొట్టారని ఉత్సాహంగా చెబుతున్నారు.

"ఘర్షణ జరిగిన రోజు చైనా సైనికులను.. భారత సైన్యం తరిమికొట్టింది. మేము భారత సైన్యాన్ని చూసి చాలా గర్విస్తున్నాం. ఇక్కడ మనకు సరిగ్గా శ్వాస కూడా ఆడదు. కానీ వాళ్లు ఆపైన ఉన్న కొండలెక్కి విధులు నిర్వహిస్తూ మనల్ని రక్షిస్తున్నారు. అందుకే మేం భారత సైన్యాన్ని చూసి గర్విస్తున్నాం. ఇక్కడ ఎలాంటి సమస్య లేదు."
-- ఓ స్థానికుడు, తవాంగ్​

"తవాంగ్‌లో మేము చాలా సురక్షితంగా ఉన్నాం. భారత సైనికులతో మాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. మాకు ఇక్కడ ఎలాంటి టెన్షన్‌ లేదు. మేము ఎక్కడికైనా భయం లేకుండా వెళ్లగలం."
-- స్థానిక మహిళ, తవాంగ్​

తవాంగ్‌లోని ప్రజలకు ఎలాంటి భద్రతా సమస్యలు లేకుండా భారత సైన్యం పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. క్షేత్రస్థాయిలో ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకుని వారికి ధైర్యంగా ఉంటోంది. భారత సైన్యం చేస్తున్న విశేష సేవలను.. స్థానికులు కొనియాడుతున్నారు. మంచు వర్షం కురుస్తున్నా వాతావరణం కఠినంగా ఉన్నా.. భారత సైనికులు తమ రక్షణ కోసం విధులు నిర్వర్తిస్తూనే ఉంటారు. అందుకే చైనా బలగాలు తవాంగ్‌ సెక్టార్‌లోకి చొచ్చుకు వచ్చేందుకు యత్నించినా.. సమర్థంగా అడ్డుకున్నారని స్థానికులు చెబుతున్నారు.

తవాంగ్‌ సెక్టార్‌లో చైనా దుందుడుకు చర్యకు నిరసనగా ధర్మశాలలో స్థానికులు.. టిబెటన్లు ఆందోళన చేశారు. డ్రాగన్‌ కుతంత్రాలు పతాకస్థాయికి చేరాయని నినదించారు. అరుణాచల్​ప్రదేశ్‌లో విధ్వంసానికి చైనా ముగింపు పలకాలని నినదించిన టిబెటన్లు.. విస్తరణ కాంక్షకు ముగింపు పలకాలని హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details