తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రతిష్టంభన వేళ స్వీట్లు పంచుకున్న భారత్​- చైనా సైన్యం - Jammu and Kashmir

India China Army: తూర్పు లద్దాఖ్​లో ప్రతిష్టంభన నెలకొన్న వేళ.. భారత్​- చైనా సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

India China Army Exchange Sweets along LAC
India China Army Exchange Sweets along LAC

By

Published : Jan 1, 2022, 7:56 PM IST

India China Army: నూతన సంవత్సరం సందర్భంగా భారత్​, చైనా సైనికులు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకున్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి.. హాట్​ స్ప్రింగ్స్​, డెమ్​ చోక్​, నాథులా, కోంగ్రా లా ప్రాంతాల్లో పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ(పీఎల్​ఏ), భారత సైనికులు పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు.

భారత్​- చైనా సైనికులు మిఠాయిల పంపిణీ

కొత్త సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

స్వీట్లు ఇచ్చిపుచ్చుకుంటున్న భారత్​-చైనా సైనికులు

తూర్పు లద్దాఖ్​లో ఇరు దేశాల మధ్య 18 నెలల ప్రతిష్టంభన నడుమ.. స్వీట్లు పంచుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2020 మే 5న ఇరుదేశ సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ తర్వాత.. సంబంధాలు క్షీణించాయి. సరిహద్దుల్లో పరస్పరం వేలాది మంది సైనికులను మోహరించాయి. 13 దఫాలు సైనిక స్థాయి చర్చలు జరిగాయి.

వినూత్నంగా శుభాకాంక్షలు..

జమ్ముకశ్మీర్​ కుప్వారాలో భారత బలగాలు.. దేశ ప్రజలకు వినూత్నంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపాయి. నియంత్రణ రేఖ వెంట ఫార్వర్డ్​ ప్రాంతంలోకి జాతీయ జెండాను ప్రతిష్ఠించి.. భారత్​ మాతా కీ జై అని నినాదాలు చేశారు సైనికులు.

కొత్త సంవత్సరం వేళ భారత్​ మాతా కీ జై నినాదాలు చేస్తున్న సైనికులు
వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపిన భారత ఆర్మీ

అంతకుముందు.. కొత్త ఏడాది సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ సైనికులు కూడా పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వద్ద ఉన్న పూంచ్‌ రావల్‌ కోట్‌, చకోటి ఉరి, చిల్లియానా తివాల్‌ క్రాసింగ్‌ పాయింట్ల వద్ద స్వీట్లు పంపిణీ చేసుకున్నారు.

ఇదీ చూడండి: సరిహద్దులో స్వీట్లు పంచుకున్న భారత్, పాక్​ జవాన్లు

ABOUT THE AUTHOR

...view details