తూర్పు లద్దాఖ్‌లో తలెత్తిన సమస్యను వేగవంతమైన పద్ధతిలో పరిష్కరించుకునేందుకు భారత్, చైనా సైన్యాలు అంగీకారానికి వచ్చాయి. ఈ మేరకు 12వ విడత చర్చల అనంతరం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఈ చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయని పేర్కొన్నాయి.
వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభనపై ఇరుపక్షాలు దాపరికం లేకుండా.. లోతైన చర్చలు జరిపాయని భారత సైన్యం పేర్కొంది.
"ఈ విడత చర్చలు నిర్మాణాత్మకంగా సాగాయని ఇరుపక్షాలు గుర్తించాయి. ఈ సమావేశం పరస్పర అవగాహన పెంపొందించేందుకు దోహదం చేశాయి. ఇప్పటికే కుదిరిన ఒప్పందాల ప్రకారం మిగిలిన అంశాలను వేగవంతమైన పద్ధతిలో పరిష్కరించుకునేందుకు అంగీకరించుకున్నాం. చర్చలు, సంప్రదింపులు కొనసాగించాలని నిశ్చయించుకున్నాం."