దేశ రాజధాని దిల్లీలో సోమవారం కొత్తగా 59 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. పాజిటివిటీ రేటు 0.10 శాతంగా నమోదైంది. దిల్లీలో ఈ ఏడాది ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గుజరాత్లో కొత్తగా 96 కేసులు వెలుగుచూశాయి. 14 నెలల తర్వాత అతి తక్కువ కేసులు నమోదయ్యాయి.
దేశంలో సోమవారం 48.01 లక్షల టీకా డోసులు పంపిణీ చేయగా.. మొత్తం డోసుల సంఖ్య 32.85 కోట్లకు చేరింది.
వివిధ రాష్ట్రాల్లో ఇలా..
- కేరళలో కొత్తగా 8,063 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. 11,529 మంది కోలుకోగా, 110 మంది ప్రాణాలు కోల్పోయారు.
- తమిళనాడులో కొత్తగా 4,804 కేసులు నమోదయ్యాయి. 6,553 మంది కోలుకోగా, 98 మంది మృతిచెందారు.
- మహారాష్ట్రలో కొత్తగా 6,727 కేసులు బయటపడ్డాయి. 10,812 మంది డిశ్చార్జ్ కాగా, 101 మంది ప్రాణాలు కోల్పోయారు.
- కర్ణాటకలో కొత్తగా 2,576 కేసులు నమోదు కాగా.. 5,933 మంది డిశ్చార్జి అయ్యారు. 93 మంది మృతిచెందారు.
ఇదీ చదవండి:వ్యాక్సినేషన్లో అమెరికాను దాటిన భారత్
'కరోనా రెండో దశ వ్యాప్తి ఇంకా తగ్గలేదు'