తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దుల్లో మౌలిక వసతులకు రూ.13వేల కోట్లు​ - border infrastructure india

India Border Infrastructure: సరిహద్దు వెంబడి మౌలిక సదుపాయాలు అభివృద్ధి కోసం ఉద్దేశించిన పథకం కొనసాగింపునకు మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ఇందుకు 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రూ.13,020 కోట్లు ఖర్చు చేయనున్నారు.

border infrastructure india
border infrastructure india

By

Published : Feb 21, 2022, 9:23 PM IST

Updated : Feb 21, 2022, 10:02 PM IST

Border Infrastructure India: పొరుగుదేశాలతో భారత్‌కు ఉన్న సరిహద్దుల వెంట మౌలిక సదుపాయల అభివృద్ధి కోసం ఉద్దేశించిన పథకం కొనసాగింపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సరిహద్దు మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పథకం కింద 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు రూ.13,020 కోట్లు ఖర్చు చేస్తారు.

ఈ పథకం కింద సరిహద్దుల వెంట కంచెలు, ఫ్లడ్‌ లైట్ల ఏర్పాటు, రహదారుల నిర్మాణం, సాంకేతికత అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. సరిహద్దులను రక్షించుకోవడం, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం అనే వ్యూహంలో భాగంగా ఈ చర్యలు చేపట్టనున్నట్లు కేంద్రం తెలిపింది.

భారత్‌కు పాకిస్థాన్‌, చైనా, బంగ్లాదేశ్‌, నేపాల్‌, భూటాన్‌, మయన్మార్‌తో సుమారు 15వేల కిలోమీటర్ల సరిహద్దులు ఉన్నాయి.

ఇదీ చూడండి:అతీతశక్తులంటూ పిల్లలను దేవుళ్లుగా ప్రకటన.. పోలీసుల ఎంట్రీతో..!

Last Updated : Feb 21, 2022, 10:02 PM IST

ABOUT THE AUTHOR

...view details