తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వారి చేతుల్లో దేశం బందీ అవుతోంది' - నిరుద్యోగంపై రాహుల్​ ట్వీట్​

దండి మార్చ్​ ఉద్యమానికి నేటితో 91 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్​ అగ్రనేత రాహల్​ గాంధీ ఆర్​ఎస్​ఎస్​పై విమర్శలు చేశారు. కొందరు నాయకుల చేతిలో దేశం బందీ అయిందని ఆరోపించారు.

India becoming increasingly chained by authoritarian forces: Rahul
'వారి చేతుల్లో దేశం బందీ అవుతోంది'

By

Published : Mar 12, 2021, 3:35 PM IST

Updated : Mar 12, 2021, 4:12 PM IST

రాష్ట్రీయ స్వయం సేవక్​ సంఘ్​ ఆధ్వర్యంలోని నాయకుల చేతిలో దేశం బందీ అవుతోందని ఆరోపించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. దండి మార్చ్​ ఉద్యమం చేసి నేటికి 91 ఏళ్లయిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

"గాంధీజీ చేపట్టిన దండి ఉద్యమం ప్రపంచ దేశాలకు స్వేచ్ఛకు సంబంధించిన సందేశాన్నిచ్చింది. ప్రస్తుతం దేశం ఆర్​ఎస్​ఎస్​ ఆధ్వర్యంలోని పాలకుల చేతిలో బందీ అవుతోంది. ఇప్పుడు దేశ ప్రజలు స్వేచ్ఛ కోసం పోరాడే సమయం ఆసన్నమైంది. గాంధీ స్ఫూర్తితో ప్రజలు ఈ పోరాటం చేయాల్సి ఉంది."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత.

1930 మార్చి 12న సబర్మతి ఆశ్రమం నుంచి గుజరాత్​లోని దండి వరకు మార్చ్​ చేశారు మహాత్మా గాంధీ. బ్రిటిష్​ ప్రభుత్వం ఉప్పుపై పన్ను విధించడాన్ని నిరసిస్తూ ఈ ఉద్యమం చేపట్టారు.

నిరుద్యోగంపై...

దేశంలోని విద్యార్థులు ప్రస్తుతం ఉద్యోగాలు కోరుకుంటుంటే... ప్రభుత్వం మాత్రం వారిపై పోలీసులతో లాఠీ ఛార్జ్​, జల ఫిరంగులతో దాడి చేయిస్తోందని విమర్శించారు రాహుల్.

ఇదీ చదవండి:తాత కోట నుంచే ఉదయనిధి స్టాలిన్‌ పోటీ

Last Updated : Mar 12, 2021, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details