దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రపంచంలోనే వేగంగా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు.. కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. నిత్యం సరాసరిన 30లక్షల 93వేల 861డోసుల పంపిణీతో అమెరికాను కూడా అధిగమించినట్లు వివరించింది.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 33లక్షల 37వేల 601 డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది. ఇందులో 30లక్షల 8వేల87 మందికి మొదటి డోసు ఇవ్వగా.. 3లక్షల 29వేల 514 టీకాలను రెండో డోసుగా ప్రజలకు అందించినట్లు పేర్కొంది. ఇప్పటివరకు.. 8కోట్ల 70లక్షల 77వేల 474 వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు వివరించింది.
- తొలి డోసు తీసుకున్నవారు 89,63,724
- రెండో డోసు తీసుకున్నవారు 53,94,913
- తొలి డోసు లబ్ధిదారులు 3,53,75,953
- రెండో డోసు లబ్ధిదారులు 10,00,787
- తొలి డోసు తీసుకున్న 60 ఏళ్లు పైబడినవారు 2,18,60,709
- 45 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల లబ్ధిదారులు 4,31,933 (రెండో డోసు)
ఇక దేశంలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా 24 గంటల్లో 1,15,736 మందికి కరోనా వెలుగు చూసింది. ఇవి ఒక్కరోజులో వచ్చిన అత్యధిక కేసులు.
80శాతానికిపైగా...
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, దిల్లీ, మధ్యప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రోజువారీ కొత్త కేసుల్లో పెరుగుదల ఎక్కువగా ఉంది. కొత్త కేసుల్లో ఈ ఎనిమిది రాష్ట్రాల నుంచే 80.70 శాతం నమోదవుతున్నాయి.