తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీకా పంపిణీలో భారత్ రికార్డు!

ప్రపంచంలోనే వేగంగా టీకాలు పంపిణీ చేస్తున్న దేశాల్లో భారత్​ అగ్రస్థానంలో నిలిచింది. కేవలం 99 రోజుల్లోనే 14 కోట్ల వ్యాక్సిన్ డోసులు​ అందించడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు కేంద్రం ప్రకటించింది.

vaccination
టీకా పంపిణీ

By

Published : Apr 25, 2021, 10:27 AM IST

రెండో దశ కరోనా విజృంభణతో అతలాకుతలమవుతోన్న భారత్..​ వ్యాక్సినేషన్​ ప్రక్రియలో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన దేశంగా అవతరించింది. 99 రోజుల్లోనే 14కోట్ల టీకా డోసులు పంపిణీ చేసి రికార్డు నమోదుచేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్​ తర్వాతి స్థానంలో అమెరికా ఉంది.

దేశవ్యాప్తంగా జనవరి 16న టీకా పంపిణీ ప్రారంభమైంది. ఏప్రిల్​ 24 రాత్రి 8 గంటల వరకు మొత్తం 14,08,02,794 టీకా డోసులు అందించినట్లు కేంద్రం ప్రకటించింది.

వీరిలో మొదటి టీకా డోసు తీసుకున్న ఆరోగ్య కార్యకర్తలు 92,89,621 కాగా.. 59,94,401 మంది రెండో డోసు తీసుకున్నారు. ఇక 1,19,42,233 మంది పారిశుద్ధ్య కార్మికులకు ఒకటో డోసు పంపిణీ చేయగా.. 62,77,797 మంది రెండో డోసు అందించినట్లు కేంద్ర గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుతం దేశంలో మొత్తం 26,82,751 యాక్టివ్​ కేసులుండగా.. కరోనా పాజిటివిటీ రేటు 15.37 శాతంగా ఉంది. కరోనా మరణాలు 1,92,311కు చేరుకున్నాయి.

ఇవీ చదవండి:'టీకాలు ఉచితంగానే అందిస్తాం'

'మే 5 తర్వాత వారికి ఉచితంగా టీకా పంపిణీ'

ABOUT THE AUTHOR

...view details