ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనతో భారత్.. పొరుగు దేశాలకే తొలి ప్రాధాన్యం ఇస్తుందనే విషయం స్పష్టమవుతోందని మాజీ హైకమిషనర్ పినక్ రంజన్ చక్రవర్తి అన్నారు. పొరుగు దేశాలకు ప్రాధాన్యంపై మోదీ అనేక సార్లు ప్రస్తావించారని.. ఈ మేరకు కరోనా తర్వాత తొలి విదేశీ పర్యటనకు బంగ్లాదేశ్‌ను ఎన్నుకున్నారని తెలిపారు. ప్రధాని పర్యటన భారత్-బంగ్లాదేశ్ బంధాలలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఈటీవీ భారత్‌కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.
'భారత్-బంగ్లా బంధంలో మోదీ పర్యటన కీలకం' - ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ పర్యటనపై మాజీ హైకమిషనర్ పినక్ రంజన్ చక్రవర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. మోదీ పర్యటన ఇరు దేశాల బంధంలో కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈటీవీ భారత్‌తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

pinak ranjan chakravarthy
భారత్ మాజీ హైకమిషనర్‌తో ఇంటర్వ్యూ
భారత్ నుంచి కొవిడ్ వ్యాక్సిన్లు పొందిన తొలి దేశం బంగ్లాదేశ్ అని రంజన్ ఉద్ఘాటించారు. ప్రధాని పర్యటన భారత్ బంగ్లాదేశ్ బంధం మెరుగైన స్థితిలో ఉందనడానికి ఉదాహరణ అని అన్నారు. దక్షిణాసియా దేశాలకు ఇరు దేశాల బంధం ఉదాహరణగా నిలుస్తుందని ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఇరు దేశాలు ఎన్నో అంశాల్లో కలిసి కృషి చేయవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి :గాంధీ శాంతి పురస్కరాన్ని రెహ్నాకు అందించిన మోదీ