విద్య, ఉపాధి కోసం చైనాకు తిరిగి వెళ్లాలనుకుంటున్న తమ ప్రయాణికుల్ని అనుమతించాలని భారత్.. ఆ దేశాన్ని కోరింది. చైనా నుంచి వచ్చేవారి విషయంలో భారత్ ఎలాంటి అభ్యంతరాలు చెప్పడం లేదని గుర్తుచేసింది. కొవిడ్ నిబంధనల పేరుతో గత నవంబరు నుంచి భారత ప్రయాణికులకు చైనా వీసాలు నిరాకరిస్తోంది.
చైనాకు వారి ప్రయాణం ఎప్పుడు? - చైనాలో భారత్ విద్యార్థులు
చైనాకు తిరిగి వెళ్లాలనుకుంటున్న తమ ప్రయాణికుల్ని అనుమతించాలని ఆ దేశాన్ని కోరింది భారత్. ఈ అంశంపై త్వరలోనే స్పష్టత వస్తుందని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు.
![చైనాకు వారి ప్రయాణం ఎప్పుడు? India, pakisthan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12088284-219-12088284-1623337873390.jpg)
భారత్, పాకిస్థాన్
చైనా తయారీ చేసిన వ్యాక్సిన్లు వేయించుకొంటేనే అనుమతిస్తామంటూ ఈ ఏడాది మార్చిలో ప్రకటించింది. దీంతో చైనా వెళ్లాలనుకుంటున్న వారంతా ఆ వ్యాక్సిన్లే వేయించుకొంటున్నారు. అయినా వారికి వీసాలు ఇవ్వడం లేదు. త్వరలోనే సమస్య పరిష్కారం కాగలదని విదేశీ వ్యవహారాలశాఖ అధికార ప్రతినిధి అరిందం బాగ్చి తెలిపారు.
ఇదీ చదవండి:'తూర్పు లద్దాఖ్‌లో.. ఉద్రిక్త ప్రాంతాలన్నీ వీడాల్సిందే'