కరోనా టీకాలను పొరుగుదేశాలు, భాగస్వామ్య దేశాలకు సరఫరా చేసేందుకు భారత్ సిద్ధమైంది. భూటాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్, సీషెల్స్ దేశాలకు వ్యాక్సిన్ డోసులను ఉచితంగా అందిస్తామని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. జనవరి 20 నుంచి వీటి సరఫరా ప్రారంభించనున్నట్లు స్పష్టం చేసింది. దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దశలవారిగా టీకాలను పంపిస్తామని వెల్లడించింది.
శ్రీలంక, అఫ్గానిస్థాన్, మారిషస్ దేశాలకు సరఫరా చేసేందుకు ఆ దేశాల నుంచి అవసరమైన అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. మిగిలిన దేశాలు ఇదివరకే భారత్‌ను అభ్యర్థించాయని పేర్కొంది.