తెలంగాణ

telangana

ETV Bharat / bharat

టీకా పంపిణీలో భారత్​ సరికొత్త రికార్డు

వ్యాక్సినేషన్​ కార్యక్రమంలో సరికొత్త రికార్డును సృష్టించింది భారత్. కేవలం 24 రోజుల్లోనే 60 లక్షల మందికిపైగా ప్రజలకు టీకా అందించి.. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా నిలిచింది. సోమవారం సాయంత్రం నాటికి దేశవ్యాప్తంగా 60,35,660 మందికి వ్యాక్సిన్​ అందించారు అధికారులు.

India achieves 60 lakh COVID-19 vaccinations in 24 days, fastest in world: Health ministry
భారత్​ రికార్డు- 24రోజుల్లో 60లక్షలమందికిపైగా టీకా

By

Published : Feb 9, 2021, 5:04 AM IST

వ్యాక్సినేషన్ ప్రక్రియలో మరో మైలురాయిని అధిగమించింది భారత్. ప్రపంచవ్యాప్తంగా.. అతితక్కువ కాలంలో అత్యధిక మందికి టీకా అందించిన తొలి దేశంగా నిలిచింది. టీకా కార్యక్రమం ప్రారంభమైన 24 రోజుల్లోనే.. 60లక్షల 35వేల 660మందికి(సోమవారం సాయంత్రం నాటికి) వ్యాక్సిన్​ అందించింది భారత ప్రభుత్వం.

ఈ మార్కుకు చేరడానికి అమెరికాకు 26 రోజులు, బ్రిటన్​కు 46 రోజుల సమయం పట్టింది.

దేశంలో మొత్తం 60,35,660 మంది టీకా లబ్ధిదారుల్లో 54,12,270 మంది ఆరోగ్య సిబ్బంది కాగా.. 6,23,390 మంది వివిధ విభాగాల్లో కరోనాపై ముందుండి పోరాడిన వారు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి మనోహర్ అజ్ఞాని తెలిపారు. ఒక్క సోమవారం రోజే 2,23,298 మందికి వ్యాక్సిన్​ అందించినట్లు వివరించారు.

ఇదీ చదవండి :'ఆ 12 రాష్ట్రాలు వ్యాక్సినేషన్​లో స్పీడ్​ పెంచాలి'

ABOUT THE AUTHOR

...view details