తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వ్యాక్సినేషన్ @100 కోట్లు- ప్రత్యేక గీతం, ఏవీ విడుదల - vaccination in india

టీకా పంపిణీ వంద కోట్లు దాటిన (India Vaccination status) సందర్భంగా ప్రత్యేక గీతాన్ని విడుదల చేశారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ. స్వయం సమృద్ధ భారతదేశానికి ఇది (100 crore vaccine) దీపావళి పండగ వంటిదని అన్నారు.

100 crore vaccine
వంద కోట్లు దాటిన వ్యాక్సినేషన్

By

Published : Oct 21, 2021, 3:44 PM IST

దేశంలో కరోనా టీకా పంపిణీ శత కోటి డోసుల మార్క్​ (India Vaccination status) దాటిన సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ.. ప్రత్యేక గీతం, ఆడియో-విజువల్(ఏవీ) చిత్రాన్ని విడుదల చేశారు. ఈ ఘనత (India vaccination count) సాధించి భారత్ చరిత్ర సృష్టించిందని మాండవీయ పేర్కొన్నారు. దిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు అధికారులు హాజరయ్యారు.

ఎర్రకోట వద్ద కార్యక్రమంలో మాండవీయ

"వంద కోట్ల డోసులు (100 crore vaccine) పంపిణీ చేసి భారత్ రికార్డు సృష్టించింది. వ్యాక్సినేషన్ వంద కోట్ల మార్క్ దాటడం దేశ ప్రజలు గర్వించే విషయం. స్వయం సమృద్ధ భారత్​కు ఇది దీపావళి పండగ."

-మన్​సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి

'టీకే​ సే బచా హై దేశ్' (100 crore vaccine song) అంటూ సాగే ఈ పాటను ట్విట్టర్​లో పోస్ట్ చేశారు మాండవీయ. పద్మశ్రీ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత గాయకుడు కైలాశ్ ఖేర్.. ఈ పాటను ఆలపించారు. దేశంలో వ్యాక్సినేషన్​కు సహకరించిన వారికి శతకోటి వందనాలు అంటూ పాడిన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది.

రైల్వేస్టేషన్లలో అనౌన్స్​మెంట్లు

వంద కోట్ల డోసుల పంపిణీ పూర్తైన నేపథ్యంలో దేశంలోని వివిధ రైల్వే స్టేషన్లలో అనౌన్స్​మెంట్​లు చేశారు. అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న దేశం భారతేనని అనౌన్స్​మెంట్లలో పేర్కొన్నారు. దేశం గర్వించే ఈ ఘనత సాకారం కావడానికి తోడ్పడిన.. శాస్త్రవేత్తలు, వైద్యులు, శానిటేషన్ సిబ్బంది, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

వంద కోట్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా దిల్లీలోని ఎయిమ్స్.. సుందరంగా ముస్తాబైంది. ఆస్పత్రిని పుష్పాలతో అందంగా అలంకరించారు.

కళకళలాడుతున్న దిల్లీ ఎయిమ్స్
పువ్వులతో ఆకర్షణీయంగా ఇలా...

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details