- రైల్వేలో వందశాతం విద్యుదీకరణ వైపు శరవేగంగా అడుగులు: ప్రధాని
- కాలుష్యరహిత వ్యవస్థగా రైల్వేను తీర్చిదిద్దే దిశగా ముందుకెళ్తున్నాం: ప్రధాని
- సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాం: ప్రధాని
- జీ-20 దేశాల్లో పర్యావరణ పరిరక్షణకు నిరంతరం కృషిచేసే దేశాల్లో భారత్ ఒకటి: ప్రధాని
- సైనిక పాఠశాలల్లో బాలబాలికలకు సమాన అవకాశాలు: ప్రధాని
- ఐటీ విప్లవం అనేక ప్రతిబంధకాలను తొలగిస్తోంది: ప్రధాని
- ప్రభుత్వాలు అనవసర నియంత్రణలు తొలగిస్తున్నాయి: ప్రధాని
- మనకు వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలు త్వరగా పోవు: ప్రధాని
- బ్యూరోక్రసీలోని నియంత్రణలు ఒక్కసారిగా పోవడం అసాధ్యం: ప్రధాని
- ఉద్యోగ స్వామ్యాన్ని కొత్త సంస్కరణల దిశగా నడిపిస్తున్నాం: ప్రధాని
- కర్మయోగి విధానంతో ఉద్యోగస్వామ్యంలో సంస్కరణలు: ప్రధాని
- మాతృభాషలో విద్యాభ్యాసం అనేది మనం మొదలుపెట్టిన కొత్త సంస్కరణ: ప్రధాని
ఎర్రకోటపై మువ్వన్నెల జెండా రెపరెపలు- మోదీ ప్రసంగం - ఎర్రకోటపై జెండా ఆవిష్కరణ
08:52 August 15
08:51 August 15
వ్యాక్సినేషన్..
దేశ విభజన గాయం నేటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది. ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. గౌరవప్రద అంత్యక్రియలకు నోచుకోని వారి చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతున్నాయి. కరోనా మహమ్మారి చుట్టుముట్టినపుడు టీకాల లభ్యతపై అనుమానం తలెత్తింది. భారత్ ప్రజలకు టీకాలు దొరుకుతాయా అనే అనుమానం వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలో మరణాలు.. వ్యాధి సంక్రమణ తక్కువే. సంక్రమణ తక్కువనేది సంతోషించాల్సిన విషయం మాత్రం కాదు. మహమ్మారి కట్టడికి క్రమశిక్షణతో కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. మన జీవనశైలి, సామాజిక కట్టుబాట్లు మనల్ని కొంతవరకు రక్షించాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 54 కోట్ల మందికి టీకాలు అందించాం. కొవిన్ యాప్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.
08:33 August 15
గ్రామాల అభివృద్ధి..
'గత కొన్నేళ్లలో గ్రామాలు బాగా అభివృద్ధి చెందాయి. రోడ్డు, విద్యుత్తు వంటి సదుపాయాలు ప్రస్తుతం అన్ని గ్రామాల్లో ఉన్నాయి. ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంది. గ్రామస్థాయిలోనూ తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు డిజిటల్ వ్యాపారులు సిద్ధమవుతున్నారు.' అని మోదీ తెలిపారు.
సన్నకారు రైతులకు సాకారం..
రానున్న రోజుల్లో సన్నకారు రైతులకు మరింత శక్తిని చేకూర్చాలని మోదీ అన్నారు. వారికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. 70కి పైగా రైలు మార్గాల్లో 'కిసాన్ రైలు' నడుస్తున్నట్లు మోదీ తెలిపారు. 'చోటా కిసాన్ భనే దేశ్ కి షాన్' అనేది తమ మంత్రని.. ఇదే దేశ లక్ష్యం అని అన్నారు.
08:19 August 15
అభివృద్ధికి పునాదులు..
ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్, లద్ధాఖ్ ప్రాంతాలు, హిమాలయ ప్రాంతం.. దేశాభివృద్ధికి పునాదులుగా మారుతాయని మోదీ వ్యాఖ్యానించారు. ఈ ప్రాంతాలను అభివృద్ధి చేయడం చాలా ముఖ్యమని తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసినట్లు మోదీ గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
భారత్ శక్తిసామర్థ్యాలను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుని 21 శతాబ్దంలో దేశాన్ని కొత్త ఎత్తుకుతీసుకెళ్లాలని మోదీ పిలుపునిచ్చారు. వెనకబడిన తరగతుల వారికి చేయూత అందించాలని పేర్కొన్నారు.
07:56 August 15
అమృత ఘడియలు..
- శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ ప్రబలశక్తిగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలి: మోదీ
- 75 నుంచి శతాబ్ది ఉత్సవాల మధ్య ఉన్న 25 ఏళ్ల కాలం అమృత ఘడియలు: మోదీ
- అమృత కాలాన్ని సర్వ సమృద్ధ భారత్ నిర్మాణానికి మనం సంకల్పం తీసుకోవాలి: మోదీ
- సంకల్పం తీసుకుంటే సరిపోదు.. నిరంతర శ్రమ, పట్టుదలతోనే అది సాకారం అవుతుంది: మోదీ
- ఈ 25 ఏళ్లను సద్వినియోగం చేసుకునేందుకు ప్రతి అడుగు కీలకమే: మోదీ
- ఒక్క క్షణం వృథా చేయకుండా ప్రతి పౌరుడూ సంకల్ప శక్తితో ముందుకు నడవాలి: మోదీ
- సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్.. ఇవే మన రణ నినాదం కావాలి: మోదీ
- సమస్త పౌరుల భాగస్వామ్యంతోనే సమృద్ధ భారతం నిర్మాణం అవుతుంది: మోదీ
- ఏడేళ్లలో ఉజ్జ్వల నుంచి ఆయుష్మాన్ వరకు అనేక పథకాలు ప్రజల ముంగిట చేరాయి: మోదీ
- ప్రతి సంక్షేమ కార్యక్రమంలో సంతృప్త స్థాయికి తీసుకెళ్లాయి: మోదీ
- సంక్షేమ, అభివృద్ధి పథకాల హక్కుదారులకు వందశాతం చేరేలా చేయాలి: మోదీ
- చిన్న వ్యాపారులు, దుకాణాదారులు అందరినీ బ్యాంకులతో అనుసంధానం చేయాలి: మోదీ
07:49 August 15
ఆ బాధ్యత మనపై ఉంది..
- దేశ విభజన గాయం నేటికీ మనల్ని వెంటాడుతూనే ఉంది: మోదీ
- ధన, మాన, ప్రాణాలు పోగొట్టుకున్న వారిని చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి: మోదీ
- గౌరవప్రద అంత్యక్రియలకు నోచుకోని వారి చేదు జ్ఞాపకాలు కళ్లముందు కదులుతున్నాయి: మోదీ
- మహమ్మారి చుట్టుముట్టినప్పుడు టీకాల లభ్యతపై అనుమానం తలెత్తింది: మోదీ
- భారత్ ప్రజలకు టీకాలు దొరుకుతాయా అనే అనుమానం తలెత్తింది: మోదీ
- ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం భారత్‌లో జరుగుతోంది: మోదీ
- ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో మరణాలు తక్కువే: మోదీ
- ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారత్‌లో వ్యాధి సంక్రమణ తక్కువే: మోదీ
- సంక్రమణ తక్కువనేది సంతోషించాల్సిన విషయం మాత్రం కాదు: మోదీ
- మహమ్మారి కట్టడికి క్రమశిక్షణతో కృషి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది: మోదీ
- మన జీవనశైలి, సామాజిక కట్టుబాట్లు మనల్ని కొంతవరకు రక్షించాయి: మోదీ
07:41 August 15
- దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ
- స్వాతంత్ర్యం కోసం పోరాడిన త్యాగధనులను నేడు దేశం స్మరించుకుంటోంది: మోదీ
- దేశ సరిహద్దుల్లో నిరంతరం పహారా కాస్తున్న వీర జవాన్లకు ప్రణామాలు: మోదీ
- కరోనాపై వైద్యులు, సిబ్బంది చేసిన పోరాటం అసమానం: మోదీ
- ప్రజల ప్రాణాలు కాపాడే వైద్యసిబ్బంది కృషి ఎంత చెప్పినా తక్కువే: మోదీ
- ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన వారంతా మనకు స్ఫూర్తి: మోదీ
- పతకాలు సాధించిన వారికి దేశం యావత్తూ వారికి గౌరవం ప్రకటిస్తోంది: మోదీ
07:31 August 15
జాతీయ పతాకం ఆవిష్కరణ
ఎర్రకోటలో ఘనంగా స్వాతంత్ర్య అమృత మహోత్సవం
ఎర్రకోటపై మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
07:23 August 15
ఎర్రకోటలో మోదీ..
ప్రధాని మోదీ ఎర్రకోటకు చేరుకున్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మోదీకి స్వాగతం పలికారు.
07:13 August 15
రాజ్‌ఘాట్ వద్దకు మోదీ..
రాజ్‌ఘాట్‌లో మహాత్మా గాంధీ సమాధికి నివాళులర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ. 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మహాత్ముడు దేశానికి చేసిన సేవలను మోదీ స్మరించుకున్నారు.
మరికొద్ది సేపట్లో ప్రధాని ఎర్రకోటకు చేరుకోనున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
06:34 August 15
భద్రతా వలయంలో ఎర్రకోట
దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోటపై.. ప్రధాని మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించున్న నేపథ్యంలో భద్రతా దళాలు ఎర్రకోటను మోహరించాయి. ఎన్ఎస్జీ స్నైపర్స్, ఎలైట్ స్వాట్ కమాండోలు, కైట్ క్యాచర్స్, కనైన్ యునిట్స్, షార్ప్ షూటర్స్ మొదలైన మల్టీలేయర్డ్ భద్రతా సిబ్బంది ఆదివారమే ఎర్రకోట వద్దకు చేరుకున్నాయి.
06:11 August 15
దేశ ప్రజలకు మోదీ స్వాతంత్ర్య శుభాకాంక్షలు
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోదీ.
ఈ ఏడాది 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాలని కోరుతూ మోదీ ట్వీట్ చేశారు.