శబరిమల దర్శనానికి రోజుకు ఐదు వేలమంది భక్తులను అనుమతించాలని ట్రావెన్కోర్ దేవస్వాం బోర్డు చేసిన ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని కేరళ దేవాదాయ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. కొవిడ్-19 నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖలను సంప్రదించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. అక్టోబరు 16న ఆలయం తెరుచుకుంది. అప్పటి నుంచి ప్రతిరోజు వెయ్యి మందికి దర్శన అవకాశం కల్పిస్తున్నారు.
'శబరిమలలో భక్తుల పెంపును పరిశీలిస్తున్నాం'
శబరిమల దర్శనానికి భక్తులను పెంచాలన్న ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని కేరళ దేవాదాయ మంత్రి తెలిపారు. అక్టోబరు 16న ఆలయం తెరుచుకోగా ప్రస్తుతం రోజుకు వెయ్యి మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.
'శబరిమలలో భక్తుల పెంపును పరిశీలిస్తున్నాం'
ప్రస్తుతం శబరిమలలో మండల మకరవిలక్కు పూజలు జరుగుతున్నాయి. సాధారణంగా ఈ సీజన్లో రోజుకు రూ. 3.5కోట్ల ఆదాయం వస్తుంది. కానీ ప్రస్తుతం రోజుకు ఆదాయం రూ. 10లక్షలు కూడా రావట్లేదని.. బోర్డు ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని తెలిపింది.
TAGGED:
శబరిమలలో భక్తుల సంఖ్య పెంపు