తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు.. 3 నెలల్లో 5188

ఏటికేటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. గతేడాదితో పోలిస్తే 19శాతం మేర ప్రమాదాలు, మరణాలు పెరిగినట్లు సుప్రీంకోర్టు రోడ్‌ సేఫ్టీ కమిటీ నివేదికలో తేలింది. గత మూణ్నెళ్లలోనే 5188 ప్రమాదాలు జరిగాయంటే ఆ తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వ్యక్తిగత వాహనాలు భారీగా పెరగడం ప్రమాదాలకు ఓ కారణమని నివేదికలో స్పష్టం చేసింది.

increasing-road-accidents
3 నెలలు.. 5188 ప్రమాదాలు

By

Published : Dec 19, 2020, 8:33 AM IST

లాక్‌డౌన్‌ ఆంక్షల సమయంలో భారీగా తగ్గిన రహదారి ప్రమాదాలు.. సడలింపుల అనంతరం అమాంతం పెరిగాయి. గతేడాదితో పోలిస్తే 19 శాతం మేర ప్రమాదాలు, మరణాలు పెరిగినట్లు సుప్రీంకోర్టు రోడ్‌ సేఫ్టీ కమిటీ నివేదికలో తేలింది. ప్రజా రవాణా వినియోగం తగ్గడం, వ్యక్తిగత వాహనాల వాడకం పెరగడమే ప్రమాదాల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి నవంబర్‌ వరకు 3 నెలల కాలంలో 5,188 ప్రమాదాలు జరిగినట్లు నివేదిక స్పష్టం చేసింది. ఈ ఘటనల్లో 2,073 మంది ప్రాణాలు కోల్పోయినట్లు కమిటీ నివేదికలో పేర్కొంది. గతేడాది ఇదే కాలానికి మొత్తం 4,761 రహదారి ప్రమాదాలు జరిగితే 1,734 మంది మృతిచెందినట్లు తెలిపింది. గతేడాది సెప్టెంబర్‌-నవంబర్‌ మధ్య కాలంతో పోలిస్తే ఈఏడాది అదే కాలంలో 19.4 శాతం మేర మరణాల రేటు పెరిగినట్లు వెల్లడించింది.

మొత్తంగా ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకు 15,992 రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. ఈ ప్రమాదాల్లో 6,339 మంది ప్రాణాలు కోల్పోయారు. 17,469 మంది గాయపడ్డారు. మార్చి నుంచి జూన్‌ మధ్య కాలంలో లాక్‌డౌన్‌ ఆంక్షల వల్ల 78 శాతం మేర రహదారి ప్రమాదాలు తగ్గినట్లు సుప్రీంకోర్టు రోడ్‌ సేఫ్టీ కమిటీ నివేదించింది. అయితే వ్యక్తిగత వాహనాలు భారీగా పెరగడమే ప్రమాదాలకు కారణమని నివేదికలో స్పష్టం చేసింది. రహదారి ఇంజినీరింగ్‌పై దృష్టిపెట్టడంతోపాటు ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్లను నివారించాల్సిందిగా రోడ్డు సేఫ్టీ సూచనలు జారీ చేసింది. రహదారి భద్రత ఆడిట్‌ను తప్పనిసరి చేయాల్సిందిగా పేర్కొంది.

ఇదీ చూడండి:'కరోనా నిబంధనల ఎత్తివేత తర్వాత ఏపీలో పెరిగిన రోడ్డు ప్రమాదాలు'

ABOUT THE AUTHOR

...view details