ఉత్తరాఖండ్‌లో మంచు దిబ్బలు విరిగిపడి పెను బీభత్సం జరిగింది. ఆకస్మిక వరదల్లో ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. వందల మంది ఆచూకీ గల్లంతైంది. అయితే అధిక సంఖ్యలో సరస్సులు ఏర్పడటమూ వరదలకూ దారితీస్తోందని ఓ అధ్యయనం హెచ్చరిస్తోంది. భూభాగంలో దాదాపు 5 శాతం హిమనీనదాలున్న హిమాచల్ ప్రదేశ్‌లో వీటి వల్ల ముప్పు అధికంగా ఉందని తెలిపింది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని నదీ పరీవాహక ప్రాంతాల్లో సరస్సుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. పంజాబ్, హరియాణలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. వాతవరణ మార్పులతో కరుగుతున్న మంచు దిబ్బల వల్ల అధిక సంఖ్యలో సరస్సులు ఏర్పడుతున్నాయి. కొత్తగా ఏర్పడే వాటితో వరదలు సంభవించే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సిమ్లాలోని వాతావరణ మార్పుల కేంద్రం చేసిన అధ్యయనం గతేడాదే ఈ అంశంపై అప్రమత్తం చేసింది.
విస్తీర్ణమూ పెరుగుతోంది..