సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ టీకా డోసుల మధ్య ఉండాల్సిన విరామాన్ని కేంద్ర ప్రభుత్వం సవరించింది. ప్రస్తుతం.. తొలి డోసు తీసుకున్న 4 నుంచి 6 వారాల తర్వాత రెండో డోసు ఇస్తున్నారు. తాజాగా ఈ సమయాన్ని '4 నుంచి 8 వారాల'కు పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.
రెండు డోసుల మధ్య విరామానికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లభించిన తర్వాత నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్, కొవిడ్ టీకాపై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందం కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది.