తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లోన్​యాప్​ సంస్థ బోగస్ దందా.. ఏడాదిలో రూ.10 వేల కోట్ల టర్నోవర్!

ఓ ఆన్​లైన్​ రుణాల యాప్​ వేధింపుల కేసులో ఐటీ శాఖ కీలక ఆధారాలు సేకరించింది. దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ.. ఇప్పటివరకు రూ.500 కోట్లను విదేశాల్లో ఉన్న బోగస్​ కంపెనీలకు బదిలీ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

loan app cases india
లోన్​యాప్​ సంస్థపై ఐటీ దాడులు.. బోగస్​ కంపెనీలకు రూ.500 కోట్లు!

By

Published : Nov 17, 2021, 10:15 PM IST

లోన్​యాప్​ సంస్థల వేధింపులకు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలను ముమ్మరం చేశాయి. ఈనెల 9న ఓ ఫిన్​టెక్​ కంపెనీ కేసులో ఆదాయపన్ను శాఖ ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు జరిపింది. దిల్లీ, గురుగ్రామ్​​లో జరిగిన ఈ రైడ్​లలో కీలక ఆధారాలను సేకరించినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) బుధవారం వెల్లడించింది.

వినియోగదారులకు ఇన్​స్టెంట్​ లోన్స్​ అందించే ఈ సంస్థ.. లోన్​ ఇచ్చే సమయంలో భారీ మొత్తంలో ఫీజు వసూలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఏడాదిలో రూ.10 వేల కోట్లు!

కేమన్ ఐలాండ్​కు చెందిన ఓ గ్రూప్​ ఈ సంస్థను నిర్వహిస్తోందని.. భారత్​లో ఈ సంస్థ నిర్వహణ బాధ్యతలను పొరుగు దేశానికి చెందిన ఓ వ్యక్తి చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎఫ్​డీఐ రూపంలో ఈ సంస్థ ఇక్కడ స్థాపించిన ఏడాదిలోనే రూ.10వేల కోట్ల టర్న్​ఓవర్​ను నమోదు చేసినట్లు తెలిపారు.

సంస్థ నిర్వహణ కోసమంటూ ఇప్పటివరకు రూ.500 కోట్లను విదేశాల్లో ఉన్న సంస్థలకు బదిలీ చేసినట్లు తమ దర్యాప్తులో వెల్లడైందన్నారు అధికారులు. అయితే దర్యాప్తులో ఈ డబ్బంతా బోగస్​ సంస్థలకు చేరినట్లు తేలిందని.. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా సేకరించామని తెలిపారు. అంతేకాకుండా.. ఈ యాప్​ సాంకేతిక నిర్వహణ కూడా విదేశాల నుంచే జరుగుతున్నట్లు తెలిపారు.

రైడ్​లో భాగంగా విదేశీయులు సహా ఈ సంస్థలో కీలక వ్యక్తుల వాంగ్మూలాలు సేకరించినట్లు అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి :కొవిడ్​ సెంటర్లో నకిలీ రోగులు.. రూ.10 వేలకు ఆశపడి...

ABOUT THE AUTHOR

...view details