తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కూలీకి భారీగా ఆదాయమట.. రూ.14కోట్లు పన్ను కట్టాలని ఐటీ శాఖ నోటీసులు - బిహార్​ లేటెస్ట్​ న్యూస్​

బిహార్​లోని ఓ కార్మికుడికి ఐటీ శాఖ పెద్ద షాకే ఇచ్చింది. ఎన్నో వ్యాపారాలు చేస్తూ కొన్ని కోట్ల రూపాయలు పన్ను ఎగవేశాడని అతనికి నోటీసులు జారీ చేసింది.

Income Tax Department sents 14 crore notice to labourer in Bihar
Income Tax Department sents 14 crore notice to labourer in Bihar

By

Published : Dec 20, 2022, 1:00 PM IST

ఐటీ శాఖ ఓ కార్మికుడికి గట్టి షాక్​ ఇచ్చింది. 14 కోట్లు ఆదాయపు పన్ను కట్టలేదని అతనికి నోటీసులు జారీ చేసింది. పన్ను కట్టకపోతే కఠిన చర్యలు తీసకుంటామని హెచ్చరించింది. ఈ ఆశ్చర్యకరమైన ఘటన బిహార్​లోని రొహ్తాస్​లో వెలుగులోకి వచ్చింది. అయితే తాను ఓ సాధారణ కూలీనని, ఇలా తనపై ఇలా పన్ను భారం విధిస్తే ఎలా కట్టాలని వాపోతున్నాడు ఆ యువకుడు.

అసలేం జరిగిందంటే..
బిహార్​లోని రోహ్తాస్​కు చెందిన మనోజ్​ యాదవ్​ అనే వ్యక్తి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజంతా శ్రమిస్తే అతనికి నెలకు 12 నుంచి 15 వేల వరకు ఆదాయం వస్తుంది. అయితే తన పేరుపై చాలా వ్యాపారాలున్నాయని, వాటిపై రూ.14 కోట్లు పన్ను కట్టాలని ఐటీ శాఖ మనోజ్​కు నోటీసులు జారీ చేసింది. దీంతో అతను ఒక్కసారిగా షాక్​కు గురయ్యాడు. అసలు తాను ఎటువంటి వ్యాపారాలు చేయట్లేదని, తనకు అన్యాయంగా నోటీసులు జారీ చేశారని మనోజ్​ వాపోతున్నాడు. అయితే హరియాణా, దిల్లీలో కూలీ పనులకు వెళ్లినప్పుడు అక్కడ కాంట్రాక్టర్లకు తన ఆధార్​, పాన్​ కార్డు కాపీలను ఇస్తుంటానని తెలిపాడు. బహుశా అక్కడే ఏదో తప్పిదం జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details