మరో నాలుగు రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. చెన్నై నీలంకరైలోని డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అల్లుడు శబరీశన్ ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన నివాసంతో పాటు పలు కార్యాలయాలు, స్థలాల్లోనూ తనిఖీలు నిర్వహించారు.
స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఐటీ శాఖ సోదాలు - స్టాలిన్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ అల్లుడు శబరీశన్ నివాసంలో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. శబరీశన్ ఇంటితో పాటు.. ఆయనకు సంబంధం ఉన్న పలు కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
స్టాలిన్ అల్లుడి ఇంట్లో ఆదాయ పన్ను సోదాలు
ఇటీవల డీఎంకే అధినేత స్టాలిన్ తిరువణ్నామలైలో ఎన్నికల ప్రచారం నిర్వహించే సమయంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే ఈవీ వేలుకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాలపైనా ఐటీ దాడులు జరిగాయి.
ఇదీ చదవండి :డీఎంకే ఎమ్మెల్యే ఇళ్లు, ఆఫీస్లపై ఐటీ దాడులు
Last Updated : Apr 2, 2021, 10:52 AM IST