తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ప్రముఖ మీడియా సంస్థలపై ఐటీ దాడులు - bhopal dainik bhaskar grom

పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ మీడియా సంస్థ 'దైనిక్ భాస్కర్‌' కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. జైపుర్​, భోపాల్‌, అహ్మదాబాద్‌లోని దైనిక్ కార్యాలయాల్లో ఏకకాలంలో అధికారులు దాడులు చేశారు. మరోవైపు.. భారత్​ సమాచార్​ మీడియా కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహించారు.

Dainik Bhaskar Group
మీడియా కార్యాలయాల్లో ఐటో సోదాలు

By

Published : Jul 22, 2021, 12:11 PM IST

Updated : Jul 22, 2021, 12:46 PM IST

ప్రముఖ మీడియా సంస్థ 'దైనిక్ భాస్కర్‌' కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ సోదాలు నిర్వహించింది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో జైపుర్​, భోపాల్‌, అహ్మదాబాద్‌లోని కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆ సంస్థ ప్రమోటర్ల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారిక సమాచారం.

భోపాల్​లోని దైనిక్​ భాస్కర్​ కార్యాలయం వద్ద ఐటీ సోదాలు
భోపాల్​లోని దైనిక్​ భాస్కర్​ కార్యాలయం
దైనిక్​ భాస్కర్​ కార్యాలయం బయటి దృశ్యాలు

హిందీ మాధ్యమంలో వార్తలు ప్రసారం చేస్తున్న దైనిక్ భాస్కర్‌ ఇటీవల కరోనా రెండో వేవ్‌పై విమర్శనాత్మక కథనాలు ప్రచురించింది. ఈనేపథ్యంలో దైనిక్‌ భాస్కర్‌ కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు... ఉత్తర్​ప్రదేశ్​ లఖ్​నవూ కేంద్రంగా పనిచేసే హిందీ టీవీ ఛానల్ భారత్​ సమాచార్​ మీడియా కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సంస్థ ఎడిటర్​-ఇన్​-చీఫ్​, ప్రమోటర్స్ ఇళ్లలోనూ తనిఖీలు నిర్వహించారు.

పార్లమెంటులో దుమారం

మీడియా సంస్థలపై ఐటీ దాడుల వ్యవహారం రాజ్యసభలో గందరగోళానికి దారితీసింది. పెగాసస్​ నిఘా వ్యవహారం సహా ఐటీ దాడులను తప్పుబడుతూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఫలితంగా ఎగువసభ రెండుసార్లు వాయిదా పడింది.

ఇదీ చూడండి:'పెగాసస్​పై సిట్​తో దర్యాప్తు చేయించాలి'

Last Updated : Jul 22, 2021, 12:46 PM IST

ABOUT THE AUTHOR

...view details