పన్ను ఎగవేత కేసుకు సంబంధించి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బంధువులకు చెందిన రూ.1400 కోట్ల విలువైన ఆస్తులను ఆదాయపన్ను శాఖ మంగళవారం జప్తు చేసింది. ముంబయిలోని నారిమణ్ పాయింట్లో ఉన్న నిర్మల్ టవర్ భవనం సహా మరో నాలుగు స్థిరాస్తులను ఈ జాబితాలో చేర్చింది.
పన్ను ఎగవేత ఆరోపణలపై ఇటీవల అజిత్ పవార్ బంధువుల నివాసాలు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు జరిపింది. ముంబయి (IT Raid in Mumbai), పుణె, సతారా సహా మహారాష్ట్ర, గోవాలోని మరికొన్ని నగరాల్లో ఐటీ దాడులు జరిగాయి.
- డీబీ రియాల్టీ, శివాలిక్, జరండేశ్వర్ సాఖర్ షుగర్ కార్ఖానా (జరండేశ్వర్ ఎస్ఎస్కే), పవార్ సోదరీమణుల (Ajit Pawar Family) వ్యాపార సముదాయాల్లో ఈ సోదాలు జరిగాయి. మొత్తం మీద రూ. 750కోట్ల రుణాలకు సంబంధించి స్కామ్ జరిగినట్టు ఆరోపణలున్నాయి. అయితే ఆస్తుల తమకే చెందినవని, వాటిని అక్రమంగా కొనుగోలు చేయాలేదని పవార్ బంధువులు నిరూపించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం 90రోజుల గడువునిచ్చారు.
- సతారాలోని జనార్థన్ షుగర్ ఫ్యాక్టరీ(రూ. 600కోట్లు), గోవాలోని నిలయ రిసార్టు(రూ. 250కోట్లు), దక్షిణ ముంబయిలోని పార్థ్ పవార్‌కు చెందిన కార్యాలయం(రూ. 25కోట్లు), దక్షిణ దిల్లీలో ఓ అపార్ట్మెంట్(రూ. 20కోట్లు)తో పాటు మరికొన్ని ఆస్తులు జప్తు చేసిన జాబితాలో ఉన్నాయి.