ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రూ.55 కోట్ల విలువైన డ్రగ్స్​ సీజ్​ - పశ్చిమ బెంగాల్ డ్రగ్స్‌ ముఠా

బంగాల్​లో అక్రమంగా తరలిస్తున్న రూ.55 కోట్ల విలువైన మాదక ద్రవ్యాలను కోల్‌కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్‌టీఎఫ్) స్వాధీనం చేసుకుంది. రెండు వేరు వేరు ఆపరేషన్లలో డ్రగ్స్‌ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

రూ.55 కోట్ల డ్రగ్స్​ సీజ్​- నలుగురు అరెస్ట్​
రూ.55 కోట్ల డ్రగ్స్​ సీజ్​- నలుగురు అరెస్ట్​
author img

By

Published : Aug 15, 2021, 6:05 PM IST

బంగాల్​లో డ్రగ్స్ రాకెట్​ను పోలీసులు ఛేదించారు. కోల్‌కతా పోర్ట్ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్​ను ప్రారంభించిన ఎస్​టీఎఫ్ బృందం.. 1.291 కిలోల మాదకద్రవ్యాలను సీజ్ చేసింది. వీటి ధర బహిరంగా మార్కెట్​లో రూ. 5 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇస్మాయిల్ షేక్, అభిషేక్ సలాం అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వీరిద్దరు మణిపుర్ నుంచి పెద్దఎత్తున డ్రగ్స్​ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. వీరిచ్చిన సమాచారంతో మరో డ్రగ్ స్మగ్లింగ్ ముఠా గట్టు రట్టు చేశారు.

చాకచక్యంగా..

పక్కా సమాచారంతో మాల్డా జిల్లా గజోల్‌కి చేరుకున్న పోలీసులు.. లలిత్ సేనాపతి, సుమిత్ అలీ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 10.068 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.50 కోట్లు ఉంటుందని ఎస్​టీఎఫ్ బృందం తెలిపింది. ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు కోల్‌కతా ఎస్‌టీఎఫ్ జాయింట్ కమిషనర్ సోలమన్ నేసకుమార్ తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details