అబంశుభం తెలియని ఓ చిన్నారిని మిఠాయి ఆశ చూపి చిదిమేశాడో పాపాత్ముడు. ఉత్తరప్రదేశ్ ముజఫర్నగర్ జిల్లాలో ఓ ఐదేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు తెలిపారు.
యూపీలో ఘోరం.. మిఠాయి ఆశచూపి అత్యాచారం - ఉత్తరప్రదేశ్ చిన్నారులపై అత్యాచారాలు
దిల్లీ అత్యాచార ఘటనను మరవక ముందే.. ఉత్తర్ప్రదేశ్లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన అమానుష సంఘటన వెలుగులోకి చూసింది.
అత్యాచారం
చిన్నారికి మిఠాయిల ఆశ చూపిన ఓ వ్యక్తి.. చార్తవల్ గ్రామంలోని ఓ ఆలయానికి సమీపంలో ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నిందితునిపై సెక్షన్ 376తో పాటు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: