ఉత్తర్‌ప్రదేశ్‌లోని భారత్-నేపాల్ సరిహద్దు జిల్లా అయిన మహారాజ్‌గంజ్‌లోని ఓ గ్రామంలో నిల్వచేసిన రూ.686 కోట్ల విలువైన నిషేధిత మందులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ), స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషలో రమేష్ కుమార్ గుప్తా అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు గోవింద్ గుప్తా కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు.
రూ.680 కోట్ల విలువైన మందుల పట్టివేత - ఉత్తర్‌ప్రదేశ్ అక్రమ మందుల రవాణా
భారత్-నేపాల్ సరిహద్దు గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మందుల రవాణాను పోలీసులు ఛేదించారు. ఘటనా స్థలం నుంచి రూ.680 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
UP-DRUGS
ఈ ఆపరేషన్‌లో 104 ఇంజెక్షన్లు, 18,782 టానిక్ బాటిళ్లు, 3,13,384 క్యాప్సూల్స్, 1,24,897 టాబ్లెట్‌లతో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:వెర్రితలలు వేస్తున్న మత్తువ్యసనం