తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బాలికపై మూడేళ్లుగా అత్యాచారం.. ఆపై.. - యూపీలో అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​లో అమానవీయ ఘటన జరిగింది. దళిత బాలికను ఓ వివాహితుడు మూడేళ్లుగా అత్యాచారం చేశాడు. ప్రస్తుతం బాలిక ఏడు నెలల గర్భిణి.

gang rape
యూపీలో అత్యాచారం

By

Published : Jul 19, 2021, 8:17 PM IST

ఉత్తర్​ప్రదేశ్​లో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ దళిత బాలికను ఓ వివాహితుడు అత్యాచారం చేశాడు. ఇది మూడేళ్లుగా సాగుతుండటం విషాదకరం. ఈ ఘటన బగపత​​ జిల్లాలో జరిగింది. బాలిక ప్రస్తుతం ఏడు నెలల గర్భణి అని పోలీసులు తెలిపారు. నిందితుడు ఓ బిడ్డకు తండ్రని వివరించారు.

సోదరులతో కలిసి..

బాలికను విహహం చేసుకోవాలనే ప్రణాళికతో ఇంటికి పిలిపించాడు షాహ్​జాద్​. అతని తల్లిదండ్రులు బాలికను ఇంట్లోనే నిర్బంధించారు. అనంతరం షాహ్​జాద్​ తన సోదరులతో కలిసి బాలికను అత్యాచారం చేశాడు. నిషేధిత ఆహారాన్ని తినేలా ఒత్తిడి చేశారని బాలిక పోలీసులకు వివరించింది. అంతేకాకుండా బలవంతంగా మతాన్ని మార్పించారని వెల్లడించింది.

బాలిక ఆరోగ్యం క్షీణిస్తుండగా.. ఆమె తండ్రికి విషయం తెలిపింది. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:ఇంటిపై విరిగిపడ్డ కొండ- ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details