Man cuts friend's genital: 'ముస్తఫా.. ముస్తఫా', 'ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడే' అంటూ స్నేహం విలువను చాటిచెప్పే గొప్ప పాటలు ఎన్నో ఉన్నాయి. స్నేహ బంధం ఎంతో ప్రత్యేకమైనది, విలువైనది! అలాంటి స్నేహానికే మచ్చ తెచ్చే ఘటన ఉత్తర్‌ప్రదేశ్ బహ్రాయిచ్‌లో జరిగింది. ఓ యువకుడు.. తన స్నేహితుడి మర్మాంగాన్ని కోసేశాడు.
ఇదీ జరిగింది..
జర్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ ఘటన. పోలీసుల సమాచారం ప్రకారం.. నయీమ్ అహ్మద్(30) అనే వ్యక్తి.. ఉత్తర అలీషేర్ ప్రాంతానికి చెందిన సులేమాన్.. మంచి స్నేహితులు. జల్వాల్లో ఒక పని నిమిత్తం.. ఇటీవలే ఇద్దరు కలిశారు. ఆ తర్వాత.. ఇద్దరు బాగా తాగారు. ఆ వెంటనే గొడవపడటం మొదలుపెట్టారు. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరడం వల్ల సులేమాన్ కోపంతో రగిలిపోయాడు. తన వద్ద ఉన్న పదునైన బ్లేడ్‌ను తీసుకుని నయీమ్ అహ్మద్ మర్మాంగాన్ని కోసేశాడు. ఆ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు.