తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం- శవాన్ని బెడ్​ కింద దాచిన కిరాతకుడు - ఒడిశాలో యువతిపై అత్యాచారం

ఉత్తర్​ప్రదేశ్​లో దారుణం జరిగింది. మూడేళ్ల బాలికపై ఓ యువకుడు హత్యాచారం చేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్ కింద దాచిపెట్టాడు. ఒడిశాలో జరిగిన మరో ఘటనలో ఓ గ్రాడ్యుయేట్ విద్యార్థినిపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

rape cases rape statistics in india
మూడేళ్ల చిన్నారిపై హత్యాచారం

By

Published : Oct 17, 2021, 9:02 AM IST

ఉత్తర్​ప్రదేశ్​ కోత్వాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత పాశవిక ఘటన వెలుగుచూసింది. మూడేళ్ల చిన్నారిపై ఓ యువకుడు హత్యాచారం చేశాడు.

నిందితుడు నివసించే ప్రాంతంలోనే బాలిక తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. తన ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని వెంట తీసుకెళ్లాడు ఆ యువకుడు. ఆ తర్వాత బాలికను రేప్​ చేసి గొంతు కోశాడు. మృతదేహాన్ని తన ఇంట్లో బెడ్ కింద దాచిపెట్టాడు. ఈ మేరకు పోలీసులు వెల్లడించారు.

డిగ్రీ విద్యార్థినిపై..

ఒడిశా మయూర్​గంజ్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ యువతిని ముగ్గురు యువకులు అత్యాచారం చేశారు. బైసింగా పోలీస్ స్టేషన్ పరిధిలోని కలామా గ్రామంలో ఈ ఘటన జరిగింది.

శుక్రవారం సాయంత్రం యువతి ఓ బాలునితో కలిసి వెళుతుండగా.. ముగ్గురు యువకులు వారిని అడ్డగించారు. ఆ బాలున్ని గాయపరిచి యువతిని అత్యాచారం చేశారని పోలీసులు తెలిపారు. బాధితురాలు డిగ్రీ చదువుతోంది. నిందితులు 22 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు వారని పోలీసులు వెల్లడించారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఇదీ చదవండి:నేరగాళ్లకు అత్తింటి మర్యాదలు

ABOUT THE AUTHOR

...view details