తెలంగాణ

telangana

By

Published : Apr 8, 2021, 1:39 PM IST

ETV Bharat / bharat

వైరస్​ కట్టడికి ఎంపీలో వారాంతపు లాక్​డౌన్​

కొవిడ్​ మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. మధ్యప్రదేశ్​ ప్రభుత్వం పాక్షిక లాక్​డౌన్​కు సిద్ధమైంది. అన్ని పట్టణాల్లో వారాంతపు లాక్​డౌన్​ విధించింది. శుక్రవారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. బెంగళూరులోని ఓ పోలీస్​ స్టేషన్​లో 60 మంది సిబ్బంది వైరస్​ బారిన పడ్డారు. దిల్లీ మెట్రో కఠిన చర్యలు తీసుకుంటోంది.

In the wake of COVID19 situation, MP will be implemented weekend lockdown in all urban areas
కరోనా కట్టడికి ఆ రాష్ట్రంలో వారాంతపు లాక్​డౌన్​

కరోనా వైరస్​ వ్యాప్తిని అరికట్టేందుకు మధ్యప్రదేశ్​ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో వారాంతపు లాక్​డౌన్​ విధించనుంది. శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటలకు 60 గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్​సింగ్ చౌహాన్​ ప్రకటించారు. వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉన్న నగరాల్లో కంటైన్​మెంట్​ జోన్​లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

పోలీస్​ స్టేషన్​పై కరోనా పంజా..

కర్ణాటకలో కరోనా కలకలం సృష్టిస్తోంది. బెంగళూరులోని చంద్ర లేఔట్​ పోలీస్​ స్టేషన్​లో ఏకంగా 60 మంది సిబ్బంది వైరస్​ బారినపడ్డారని అధికారులు తెలిపారు.

672 మందికి జరిమానా..

దేశ రాజధాని దిల్లీలో కరోనా మార్గదర్శకాలను పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు దిల్లీ మెట్రో రైల్వే అధికారులు. మాస్క్​ ధరించకపోవడం, భౌతిక దూరం వంటి నింబంధనల్ని పాటించని కారణంగా.. బుధవారం(ఈ నెల 7న) 672 మంది ప్రయాణికులకు జరిమానా విధించారు.

'పరీక్షల్ని రద్దు చేయండి'

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న వేళ.. సీబీఎస్​ఈ 10, 12 తరగతుల పరీక్షల్ని రద్దు చేయాలని కోరుతూ లక్ష మందికిపైగా విద్యార్థులు ప్రభుత్వాన్ని కోరారు. మేలో జరగాల్సిన బోర్డు పరీక్షల్ని రద్దు చేయాలని లేదా ఆన్​లైన్​ ద్వారా నిర్వహించాలని.. 'క్యాన్సల్ ​బోర్డ్​ ఎక్సామ్స్​2021' అనే హ్యాష్​ట్యాగ్​తో ట్వీట్​ చేశారు.

ఇదీ చదవండి:దేశంలో కొత్తగా లక్షా 26వేల మందికి కరోనా

ABOUT THE AUTHOR

...view details