ఎనిమిదేళ్ల బాలుడు పెద్ద సాహసమే చేశాడు. తమిళనాడులోని విల్లుపురానికి చెందిన శబరీనాథ్ అనే బాలుడు తన తల్లిని వెదుకుతూ రాత్రిపూట సైకిల్‌పై 92 కిలోమీటర్ల ప్రయాణానికి ఉపక్రమించాడు.
ఇదీ జరిగింది..
తమిళనాడు విల్లుపురంలోని తిండివనంలో విలేజ్ అసిస్టెంట్ రఘురామన్-రాజేశ్వరి భార్యాభర్తలు. నెలరోజులు క్రితం వీరి మధ్య వచ్చిన ఓ చిన్న తగాదా పెద్ద గొడవగా మారింది. దీంతో రాజేశ్వరి కల్లకురిచిలోని తన పుట్టింటికి వెళ్లింది. అమ్మ తిరిగి వస్తుందని ఎదురుచూసిన చిన్న కొడుకు శబరీనాథ్ ఎంతకీ రాకపోగా డీలాపడ్డాడు.
శబరీనాథ్ ఉపయోగించిన సైకిల్ సైకిల్‌పైనే..
దీనితో అమ్మను ఎలాగైనా కలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా సోమవారం రాత్రి తన అమ్మమ్మ వాళ్లింటికి బయలుదేరాడు. తిండివనం నుంచి 92 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్లకురిచికి వెళ్లేందుకు స్నేహితుడి వద్ద సైకిల్ తీసుకున్నాడు. విల్లుపురం-నాగపట్టణం జాతీయ రహదారిపై అప్పటికే 14 కి.మీ ప్రయాణించిన బాలుడిని పోలీసులు గుర్తించారు. ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్తున్నావంటూ అడిగారు.
శబరీనాథ్‌ను తండ్రికి అప్పగిస్తున్న పోలీసులు బాలుడు చెప్పిన విషయం విని చలించిపోయారు. ఆ సమయంలో బాలుడు ఒంటరిగా ప్రయాణించడం సురక్షితం కాదని భావించి.. తండ్రిని పిలిపించి అప్పగించారు. అనంతరం సమాచారం తెలుకున్న తల్లి రాజేశ్వరి సైతం ఇంటికి వచ్చి కుమారుడిని కలుసుకుంది. బాలుడి ప్రేమకు ఉప్పొంగిపోయింది.
ఇవీ చదవండి: