రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఏదైనా దొరికితే వెంటనే తీసుకుంటాం. ఇక అది బంగారమైతే.. ఒక వేళ వజ్రాలైతే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు. అది ఎవరు పోగోట్టుకున్నది మనకు అనవసరం. అయితే సూరత్‌కు చెందిన ఓ స్వీపర్ అలా అనుకోలేదు. తనకు దొరికిన వజ్రాలను యజమానికి అందజేసి తన గొప్పతనాన్ని చాటుకున్నాడు.
ఇదీ జరిగింది..
సూరత్‌లోని కాటార్‌గామ్‌లో గల పంచదేవ్ అనే ఫ్యాక్టరీలో వినోద్ స్వీపర్‌గా పని చేస్తున్నాడు. ఫ్యాక్టరీలోని పార్కింగ్ స్థలంలో ఊడుస్తున్నప్పుడు అతనికి రెండు ప్యాకెట్లు కనిపించాయి. అందులో వజ్రాలు ఉండటం చూసి ఒక్కసారిగా అవాక్కయిన వినోద్.. ఆ వజ్రాల ప్యాకెట్లను పరిశీలించి.. సేత్నే డైమండ్ అసోసియేషన్‌ను సంప్రదించాడు. వారికి జరిగిన విషయాన్ని చెప్పాడు. వాటి విలువ రూ. లక్ష ఉంటుందని సేత్నే డైమండ్ అసోసియేషన్ నిర్వాహాకులు నిర్ధరణకు వచ్చారు. ఎవరు పోగొట్టుకున్నారన్న దానిపై వాకబు చేశారు. ఆ ప్యాకెట్లు రమేశ్‌భాయ్‌కు చెందినవిగా గుర్తించారు. రమేశ్‌భాయ్‌కు ప్యాకెట్లను అందజేశారు. వినోద్ నిజాయతీని మెచ్చుకుని అతడిని సన్మానించారు.
రాత్రికి రాత్రే లక్షాధికారి..
అదృష్టం.. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ కూలీని రాత్రికి రాత్రే అతణ్ని లక్షాధికారిని చేసింది. వజ్రాల గనిగా ప్రసిద్ధి గాంచిన మధ్యప్రదేశ్ పన్నా జిల్లాలో ఈ సంఘటన ఒక కూలీకి లక్షల విలువ చేసే వజ్రం లభించింది. పన్నా జిల్లాలో కృష్ణ కళ్యాణ్‌పూర్ పట్టిలో గత 9నెలలుగా గనిని లీజుకు తీసుకున్న సురేంద్ర లోధీ వ్యక్తి.. తవ్వకాలు చేపడుతున్నాడు. ఈ క్రమంలో అతడికి ప్రకాశవంతమైన 3.15 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో సురేంద్ర ఆ వజ్రాన్ని వెంటనే జిల్లా డైమండ్ కార్యాలయంలో డిపాజిట్ చేశాడు. అనంతరం దాన్ని వేలం వేయనున్నారు. దాని విలువ రూ. 15 లక్షల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.