తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోనియా నేతృత్వంలో విపక్షాల ఐక్యతా రాగం! - సోనియా గాంధీ వర్చువల్​ సమావేశం

విపక్ష నేతలతో ఈ నెల 20న కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీ వర్చువల్​ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి తమిళనాడు, మహారాష్ట్ర, బంగాల్ రాష్ట్రాల​ ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.

sonia gandhi
సోనియా గాంధీ

By

Published : Aug 13, 2021, 10:28 PM IST

కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు విపక్ష నేతలతో.. కాంగ్రెస్‌ వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 20న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ వర్చువల్‌గా నిర్వహించనున్న భేటీకి హజరయ్యేందుకు విపక్ష నేతలు సిద్ధమయ్యారు.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, ఎన్​సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఈ సమావేశానికి హజరుకానున్నారని ఆయా పార్టీ వర్గాలు వెల్లడించాయి. బంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా సోనియా నిర్వహించే వర్చువల్‌ భేటీకి హజరవుతారని తృణమూల్‌ వర్గాలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్‌ నుంచి ఆహ్వానం అందితే.. సమావేశానికి హాజరయ్యేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సిద్ధంగా ఉన్నట్లు డీఎంకే వర్గాలు పేర్కొన్నాయి.

ABOUT THE AUTHOR

...view details