రాజస్థాన్‌లో భాజపా ఎమ్మెల్యే అమృత మేఘవాలాపై దాడి (attack on bjp leaders) మరిచిపోక ముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భరత్‌పుర్ జిల్లా, బయనాలో ఉన్న భాజపా ఎంపీ రంజీతా కోలీ నివాసంపై మంగళవారం అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. అంతేకాకుండా బెదిరింపులతో కూడిన లేఖను ఇంటికి (attack on bjp leaders in rajasthan) అతికించారు. ఈ ఘటనలో ఎంపీ కోలీ స్పృహతప్పి పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు.
చంపేస్తామని బెదిరించి.. ఎంపీ నివాసంపై కాల్పులు - attack on bjp leaders in rajasthan
రాజస్థాన్ భాజపా ఎంపీ రంజీతా కోలీ నివాసంపై (attack on bjp leaders) మంగళవారం అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరిపారు. అంతేకాకుండా బెదిరింపు లేఖను ఇంటికి అతికించారు.
![చంపేస్తామని బెదిరించి.. ఎంపీ నివాసంపై కాల్పులు Bharatpur MP Ranjeeta Koli](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13591324-266-13591324-1636520936318.jpg)
ఎంపీ రంజీత కోలీ నివాసంపై కాల్పులు
'నీ స్థాయికి మించిన పనుల్లో తలదూర్చితే నేరుగా కాల్చి చంపేస్తాం. ఎవరూ నిన్ను కాపాడలేరు.' అంటూ లేఖలో ఎంపీని దుండగులు బెదిరించారు. ఈ ఏడాది మే 27న కోలీ కారుపై దుండగులు దాడి చేశారు. ఫోన్‌చేసి చంపేస్తామంటూ బెదిరించారు. ఇప్పుడు ఏకంగా కాల్పులకు తెగబడ్డారు.
ఇదీ చదవండి:66 కిలోల డ్రగ్స్ సీజ్.. విలువ రూ.350 కోట్లకు పైనే...