పాకిస్థాన్ నుంచి పంజాబ్లోకి బెలూన్లు వచ్చిపడుతున్నాయి. వీటిన చూసిన అక్కడి సరిహద్దు గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 'ఐ లవ్ పాకిస్థాన్' అని రాసి ఉన్న బెలూన్లతో పాటు.. పాక్ జాతీయ జెండాలు ప్రజలకు కంటిమీదు కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ బెలూన్లను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు బెలూన్లను స్వాధీనం చేసుకున్నారు.
స్థానిక పొలాల్లో ఆదివారం ఉదయం కనిపించిన పాక్ బెలూన్లు, జెండాలు ఎక్కడినుంచి వచ్చాయనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.