తెలంగాణ

telangana

ETV Bharat / bharat

శ్రీనగర్​లో సీఐడీ ఇన్​స్పెక్టర్​ను కాల్చిచంపిన ఉగ్రవాదులు - srinagar cid inspector killed

CID inspecter
సీఐడీ ఇన్​స్పెక్టర్​

By

Published : Jun 22, 2021, 9:24 PM IST

Updated : Jun 22, 2021, 10:07 PM IST

21:21 June 22

సీఐడీ ఇన్​స్పెక్టర్​ను కాల్చిచంపిన ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్​ నౌగామ్​లో ఓ సీఐడీ ఇన్​స్పెక్టర్​ను ఉగ్రవాదులు కాల్చిచంపేశారు. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

"నగౌన్​లోని కానిపొరలో ప్రార్థనలు చేసి వెనక్కి వస్తుండగా, సీఐడీ ఇన్​స్పెక్టర్​ పర్వేజ్​ దార్​పై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో పర్వేజ్​ తీవ్రంగా గాయపడగా.. ఆయన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. మార్గం మధ్యలో పర్వేజ్​ ప్రాణాలు కోల్పోయారు."

--- సీనియర్​ అధికారి.

ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు, దాడికి పాల్పడిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు ఆ అధికారి స్పష్టం చేశారు.

సోపోర్​లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టిన ఒక రోజు అనంతరం ఆ ఘటన జరగడం గమనార్హం.

Last Updated : Jun 22, 2021, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details