ఓ వ్యక్తిని తీవ్రంగా చితకబాది(attack on tribals), తాళ్లతో కట్టి ట్రక్కుతో ఈడ్చుకెళ్లిన(person dragged by truck) అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్ నీమచ్ జిల్లాలో జరిగింది. తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా(Viral news) మారాయి.
ఇదీ జరిగింది..
జిల్లాలోని సింగోలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ గ్రామానికి చెందిన కన్హయలాల్ భీల్(40) సింగోలీ- నీమచ్ ప్రధాన రహదారిపై గత గురువారం నిలుచుని ఉన్నాడు. ఛితర్ మాల్ గుర్జార్ అనే పాల వ్యాపారి ద్విచక్రవాహనంపై వచ్చి భీల్ను ఢీకొట్టి కిందపడిపోయాడు. పాలు మొత్తం ఒలికిపోయాయి. పాలు నేలపాలయ్యాయనే కోపంతో భీల్పై దాడి చేశాడు గుర్జార్. ఆ తర్వాత తన స్నేహితులను పిలిచి.. కొట్టించాడు. అందరు కలిసి భీల్ కాళ్లకు తాడు కట్టి.. పికప్ ట్రక్కు వెనకాల కట్టేసి కొంత దూరం ఈడ్చుకెళ్లారు(person dragged by truck).
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. అప్పటికే.. దాడికి పాల్పడిన దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు.. బాధితుడిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే.. చికిత్స పొందుతూ భీల్ మృతి చెందాడు.