ఉత్తర్ ప్రదేశ్‌లోని ఓ ముస్లిం కుటుంబం చేసి పని మత సామరస్యాన్ని చాటింది. తమ భూమిని శివాలయ నిర్మాణానికి విరాళంగా ఇచ్చి మతాలకు అతీతంగా నిలిచింది. దేవాలయ నిర్మాణానికి సైతం అందరూ తరలిరావాలని స్థానికులకు ఆ కుటుంబం పిలుపునిచ్చింది.
భూమిని విరాళంగా ఇచ్చి.. మత సామరస్యాన్ని చాటి.. - శివాలయానికి భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం కుటుంబం
ఓ ముస్లిం కుటుంబం మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. శివాలయానికి తమ భూమిని విరాళంగా ఇచ్చి దాతృత్వాన్ని చాటుకుంది. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో జరిగింది.

శివాలయానికి భూమిని విరాళంగా ఇచ్చిన ముస్లిం కుటుంబం
ఉత్తర్ ప్రదేశ్ మేరఠ్ రషీద్నగర్కు చెందిన ఖాసీం అలీకి బ్రహ్మపురిలో 200యార్డుల భూమి ఉండేది. 1976లో ఆ భూమిని ఖాసీం అలీ శివాలయ నిర్మాణం కోసం విరాళంగా ఇచ్చారు. ఖాసీం కుమారుడు అసీమ్ ఆ భూమిని శివాలయం నిర్మాణం కోసం ఇటీవల మందిర్ సమితి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించారు. అంతేకాకుండా శివాలయ నిర్మాణానికి మతాలకు అతీతంగా అందరూ రావాలని ఖాసీం కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు.