తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అటు కరోనా దండయాత్ర- ఇటు ప్రజల విహారయాత్ర - Manali Memes

హిమాచల్​ప్రదేశ్​ మనాలీ వీధులు పర్యటకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఆ దృశ్యాలు చూస్తే అసలు దేశంలో కరోనా ఉందా? అన్న అనుమానాలు వస్తాయి. కొవిడ్​ నిబంధనలు పట్టించుకోకుండా.. కనీసం మాస్కులు కూడా లేకుండా చాలా మంది మనాలీ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు. కొవిడ్​ మూడో దశ వార్తల నేపథ్యంలో ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్​ విపరీతంగా పేలుతున్నాయి.

manali tourists
మనాలీ వీధులు

By

Published : Jul 5, 2021, 2:09 PM IST

"భారత్​లో కరోనా విలయతాండవం.. ఆసుపత్రుల్లో ఖాళీలు లేక కొవిడ్​ రోగులు విలవిల.. ప్రాణవాయువు దక్కక ప్రాణాలు ఆవిరి.. గంగానదిలో మృతదేహాల కలకలం".. ఇవీ కరోనా రెండో దశలో దేశం పరిస్థితి. కొవిడ్​ 2.0 సృష్టించిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. ఆ విలయం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. కానీ మూడో వేవ్​ కూడా వస్తుందని, అందరూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు ఎప్పటికప్పుడు సూచిస్తూనే ఉన్నారు. అయినప్పటికీ అనేకమంది ప్రజలు కరోనా నిబంధనలు బేఖాతరు చేస్తూ ఇష్టారీతిలో ప్రవర్తిస్తున్నారు. ఇందుకు హిమాచల్​ప్రదేశ్​ మనాలీ వీధులు సాక్ష్యంగా నిలుసున్నాయి.

రివెంజ్​ ట్రావెల్​..

మనాలీ వీధులు పర్యటకులతో కిక్కిరిసిపోతున్నాయి. ఇసుకేస్తే రాలనంత మంది మనాలీలో దర్శనమిస్తున్నారు. అందులో చాలా మందికి మాస్కులు కూడా లేవు! కొవిడ్​ మూడో దశ అనివార్యం అన్న వార్తలు వెలువడుతున్న తరుణంలో ఈ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి.

మనాలీలో ఇదీ పరిస్థితి

ఈ వ్యవహారంపై అనేకమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనాలీ పర్యటనను.. 'రివెంజ్​ ట్రావెల్​'గా అభివర్ణిస్తున్నారు. కరోనా లాక్​డౌన్​ కారణంగా ఇప్పటివరకు ఇళ్లల్లోనే ఉన్న ప్రజలు.. ఇప్పుడు ఇళ్ల బయటే ఉంటున్నారని అంటున్నారు. ఒకప్పుడు ఆసుపత్రుల్లో బెడ్లులేక విలవిలలాడితే.. ఇప్పుడు హోటళ్లలో రూముల్లేక ఇబ్బంది పడుతున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వ్యవహారంపై మీమ్స్​ కూడా చక్కర్లు కొడుతున్నాయి.

ఇదీ చూడండి:-కొవిడ్​ నిబంధనలు గాలికి.. 241 మందిపై కేసు!

ABOUT THE AUTHOR

...view details