తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మావటికి ఏనుగు అశ్రునివాళి - మావటి

కేరళలో ప్రసిద్ధ మావటి దామోదరణ్ నాయర్​ కన్నుమూశారు. ఆయన అంత్యక్రియల్లో.. తాను ప్రేమగా పాతికేళ్లు సంరక్షించిన బ్రహ్మదాతన్ అనే ఏనుగు అశ్రు నయనాలతో సంతాపం తెలిపింది.

elephant tribute to mahout
మావటికి ఏనుగు నివాళి

By

Published : Jun 5, 2021, 9:45 AM IST

Updated : Jun 5, 2021, 11:10 AM IST

మావటి నాయర్​కు ఏనుగు కన్నీటి వీడ్కోలు

తనను కంటికి రెప్పలా చూసుకున్న మావటికి అశ్రునివాళి అర్పించింది ఓ ఏనుగు. ఈ ఘటన కేరళలోని కొట్టాయంలో జరిగింది.

ఏనుగుతో మావటి నాయర్

కూరప్పుడకు చెందిన ప్రసిద్ధ మావటి దామోదరణ్ నాయర్​ ఇటీవల మరణించారు. 60ఏళ్లుగా ఆయన ఏనుగులను సంరక్షిస్తున్నారు. పల్లట్​ బ్రహ్మదాతన్​ అనే ఏనుగుకు పాతికేళ్లుగా సంరక్షకుడిగా ఉన్నారు. వారిద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉంది. దీంతో నాయర్​ అంత్యక్రియల్లో ఆయనను కడసారి చూడటానికి వచ్చిన బ్రహ్మదాతన్.. కన్నీటి వీడ్కోలు పలికింది.

దామోదరణ్ నాయర్

ప్రముఖ పండుగలకు మావటిగా వచ్చేవారు నాయర్​. ఎంతోమందిని ఏనుగుల సంరక్షకులుగా తీర్చిదిద్దిన ఆయన పలు అవార్డులను సైతం పొందారు.

ఇదీ చూడండి:హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ఏనుగు విడుదల!

Last Updated : Jun 5, 2021, 11:10 AM IST

ABOUT THE AUTHOR

...view details