కేరళలో మూగజీవాలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా.. ఎర్నాకుళంలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపక్కన ఉన్న 7 కుక్క పిల్లలకు ఇద్దరు మహిళలు నిప్పంటించారు. 1 నెల వయసున్న ఆ కుక్కపిల్లలు మరణించాయి.
ఈ ఘటనలో కుక్కపిల్లల తల్లి కూడా గాయపడింది. రంగంలోకి దిగిన 'దయ' కార్యకర్తలు తల్లి శునకాన్ని రక్షించి చికిత్స అందించాయి. చికిత్స అనంతరం దానిని సురక్షిత ప్రాంతానికి తరలిస్తామని పేర్కొన్నారు.