తెలంగాణ

telangana

లోయలో పెరుగుతున్న ఉగ్రవాదం- వారానికి ఐదుగురు హతం!

By

Published : Dec 31, 2020, 11:33 AM IST

దేశంలో కరోనా కలకలం కొనసాగుతున్నా.. జమ్ముకశ్మీర్​లో మాత్రం ​ఉగ్రవాదం కలవరింపు ఆగడం లేదు. ఏడాది కాలంగా తీవ్రవాద తీర్థం పుచ్చుకునే వారి సంఖ్య అమాంతం పెరిగింది. అదే స్థాయిలో భద్రతా బలగాలు ముష్కరులను మట్టుపెడుతున్నాయి. సగటున వారంలో ఐదుగురు హతం అవుతున్నారు.

in-kashmir-40s-has-a-deadly-meaning-in-2020
ఏడాదిలో పెరిగిన ఉగ్రవాదం.. చిగురిస్తోన్న ప్రజాస్వామ్యం ఆశలు

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు తరువాత ఉగ్రవాద కార్యకలాపాల జోరు పెరిగింది. ఏడాది కాలంగా ఉగ్రవాదం పట్ల ఆకర్షితులవుతున్న కశ్మీరీ యువత 40శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఇదే సమయంలో భద్రతా దళాలు ముష్కరులను ఏరిపారేస్తున్నాయి. సైన్యం పేర్కొన్న వార్షిక లెక్కల ప్రకారం గతేడాదితో పోలిస్తే 41 శాతం అధికంగా ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు.

పాక్​ గిల్లికజ్జాలు..

అధికరణ-370 రద్దు అనంతరం.. కశ్మీర్​ లోయలోకి తీవ్రవాదాన్ని ఉసిగొల్పేందుకు ఎప్పటిలానే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆసరాగా చేసుకుంది పాక్​. ఇలా చేస్తూ ఉగ్ర చొరబాటుదారులను సరిహద్దులు దాటిస్తుంది. కశ్మీర్​లో యువతను ఉగ్రవాదంవైపు మళ్లేలా శిక్షణ ఇప్పిస్తోంది. ఇలా ఇప్పటివరకు దాయాది దేశం 4700 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించింది. గతేడాదితో పోల్చితే ఇది 48 శాతం అధికం కావడం గమనార్హం.

ఈ విషయంలో మన భద్రతా దళాలూ దీటుగా సమాధానం ఇస్తున్నాయి. ఈ సోమవారం వరకు 215 మంది ముష్కరులను సైన్యం హతమార్చింది. గత ఐదేళ్లలో ఈ సంఖ్యే అత్యధికం కావడం విశేషం. మొత్తంగా ఐదేళ్లలో హతమైన వారి సంఖ్య 937.

ఈ లెక్కన ఏటికేడు ఉగ్రవాదుల సంఖ్య పెరుగుతున్నా.. అదే రీతిలో మన బలగాల చేతిలో ప్రాణాలు విడుస్తున్నారు.

ఏ సంవత్సరంలో ఎంత మంది ఉగ్రవాదులు చనిపోయారో వివరాలు ఇలా ఉన్నాయి.

2020- 215

2019-153

2018-215

2017-213

2016-141

మొత్తం- 937

ఉగ్ర సంస్థల్లో చేరే వారూ ఎక్కువే..

జమ్ముకశ్మీర్​ నుంచి ఉగ్రవాద సంస్థల్లో చేరేవారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూ ఉంది. పాకిస్థాన్​లో ఉండేవి మాత్రమే కాక ఇతర సంస్థలు కూడా కశ్మీరీలను ఉగ్రవాదం వైపు అడుగులు వేసేలా చేస్తున్నాయి. ఈ ఏడాదిలో మొత్తం 166 మంది ఉగ్రవాదం పట్ల ఆకర్షితులయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. 2019తో పోల్చితే 40శాతం పెరిగింది. ఇలా ఉగ్రవాదం వైపు అడుగులు వేసే వారి గణాంకాలు ఇలా ఉన్నాయి.

2020-166

2019-119

2018-191

2017-128

2016-88

2015-66

సైన్యం పటిష్ఠ చర్యలు

కశ్మీర్​ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టే దిశగా భారత సైన్యం గట్టి చర్యలు చేపట్టింది. ఇందుకు మూడంచెల వ్యవస్థను రూపొందించింది. స్థానిక పోలీసులతో, పారా బలగాలతో ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి కచ్చితమైన ప్రణాళికలు రచిస్తోంది. వీటితో పాటు సాంకేతిక పర్యవేక్షణ, మానవ మేథస్సుతో ఉగ్రవాదానికి దీటైన సమాధానమిస్తోంది.

నూతన అధ్యాయం మొదలవుతోందా?

జమ్ముకశ్మీర్​ ఎన్నికలంటే చాలు గుర్తొచ్చే దృశ్యాలు ముష్కరుల మారణకాండలు.. ఎన్నికల్ని బహిష్కరించాలంటూ వేర్పాటువాద శక్తుల విస్తృత ప్రచారాలు.. రిగ్గింగ్​ ఆరోపణలు.. అయితే నేడు పరిస్థితి మారుతోంది. జిల్లా అభివృద్ధి మండళ్ల (డీడీసీ) ఎన్నికల ప్రక్రియ ఇటీవల సజావుగా ముగిసిన నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో కొత్త ఆశల పొద్దు చిగురిస్తోంది. ఈ క్రమంలో అక్కడి రాజకీయ పార్టీలు అన్నీ కలిసి యువతకు దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- సంజీవ్​ బారువా(సీనియర్​ జర్నలిస్టు)

ఇదీ చూడండి: కశ్మీర్​ ఎన్నికల ప్రక్రియలో నూతన అధ్యాయం

ABOUT THE AUTHOR

...view details