ప్రభుత్వాలు పట్టించుకోని తమ గ్రామంలోని ఓ సమస్యను ప్రజలే పరిష్కరించుకుని వారెవ్వా అనిపించుకున్నారు. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా సుల్య తాలుకా మోగ్రలో.. గ్రామ ప్రజలే ప్రభుత్వ సాయం లేకుండా.. కాలువపై వంతెన నిర్మించి సమస్యను పరిష్కరించుకున్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా స్పందన రాకపోయే సరికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఏళ్ల నాటి సమస్య..
15 వందల జనాభా గల మోగ్ర.. ఓ మారుమూల గ్రామం. కమీల, ఎరనగుడే, మల్కజే, బల్లక్క లాంటి ప్రాంతాలకు.. కేంద్రం మోగ్రనే. కానీ ఏళ్లుగా వాటి అనుసంధానం సరిగ్గా లేదు.
ప్రభుత్వ పాఠశాల, ఆస్పత్రి, గుడి.. అన్నీ మోగ్రలోనే ఉన్నాయి. కానీ అక్కడికి చేరుకోవాలంటే ప్రజలకు ఓ కాలువ అడ్డుపడుతోంది. దానిని దాటడానికి సరైన వంతెన లేదు. వక్క చెట్టు కర్రలతో నిర్మించిన వంతెనే దిక్కు. దాని మీద నుంచి చిన్నారులు, మహిళలు ప్రమాదకరంగా దాటాల్సి వచ్చేది.
వక్క కర్రలపై ప్రమాదకరంగా వాగు దాటుతున్న చిన్నారులు కలగానే బ్రిడ్జి..
ఈ నేపథ్యంలో బ్రిడ్జి కోసం 2006 నుంచే డిమాండ్ మొదలైంది. ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు హామీలు ఇస్తున్నప్పటికీ.. వంతెన నిర్మాణం ఓ కలగానే మిగిలింది. దీంతో వంతెనను తామే ఎందుకు నిర్మించుకోకూడదని భావించిన గ్రామస్థులు.. దానికోసం నడుంబిగించారు. 'గ్రామ సేతు' అనే పేరుతో వంతెన నిర్మాణం చేపట్టారు.
నిర్మాణ పనుల్లో గ్రామస్థులు స్వేచ్ఛగా నడవడం సహా బైకులు కూడా వెళ్లేందుకు వీలుగా బ్రిడ్జి నిర్మాణం కోసం.. వేలాడే వంతెనల నిర్మాణ నిపుణుడు, పద్మశ్రీ గ్రహీత పతంజలి భరద్వాజ్ ప్రణాళిక అందించారు. దీనికి ఎంతోమంది దాతలు నిధులు సమకూర్చారు. గ్రామస్థులే నిర్మాణ పనుల్లో పాల్గొన్నారు. ఇనుముతో.. 20 మీటర్ల పొడవు, 1.2 మీటర్ల వెడల్పుతో వంతెనను నిర్మించారు. సుమారు రూ.1లక్ష ఖర్చుతో ప్రభుత్వ సహకారం లేకుండానే నిర్మాణం పూర్తి చేశారు.
వంతెన నిర్మంచిన సంతోషంలో గ్రామస్థులు ఇదీ చూడండి:చీనాబ్ రైల్వే వంతెన ఆర్చ్ నిర్మాణం పూర్తి